వచ్చే 10రోజులు ఈ రాశులవారు జాగ్రత్త.. మీకు అగ్ని పరీక్షే!
వేద జ్యోతిష్య శాస్త్రంలో జులై చివరి వారంలో గ్రహాల స్థితిలో ముఖ్యమైన మార్పులు వస్తాయి. గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు వక్ర గమనం నుండి సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంద. శని మీనరాశిలో తిరోగమనం చెందుతాడు. అలాగే రాహు కేతువులు చంద్రుడి ప్రభావంతో గ్రహణ యోగం ఏర్పడుతుంది.
ఈ రాశులవారికి అగ్ని పరీక్ష
దీంతో కొన్ని రాశులవారు ఊహించని కష్టాలను ఎదుర్కొంటారు. ఈ కాలంలో కొన్ని రాశులవారి జీవితంలో ఆర్ధిక ఇబ్బందులు వస్తాయి. వీరు ఈ సమయంలో అగ్ని పరీక్షను ఎదుర్కొంటారు. మరి ఈ ముఖ్య గ్రహాల సంచారంతో ఇబ్బంది పడే ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులకు ఈ సమయంలో విపరీతమైన మానసిక ఒత్తిడి ఉంటుంది. ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి రాదు. కార్యాలయంలో అదనపు బాధ్యతలు మోయాల్సి వస్తుంది. వైవాహిక జీవితం సుఖంగా ఉండదు. జీవిత భాగస్వామితో విబేధాలు వస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం అవసరం. ఈ సమయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచి తూచి తీసుకోవాలి. ఇది కర్కాటక రాశి వారు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం.
కన్యా రాశి
కన్య రాశి వారికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆశించిన ఫలితాలు రావు. వర్తక వ్యాపారాలు చేసేవారు వ్యాపార లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల సలహాలు తీసుకోవడం ఉత్తమం. అయితే ఈ సమయంలో ఆర్థిక లావాదేవీలు చేయకుండా ఉంటేనే మంచిది. అనవసరమైన వివాదాలకు కన్య రాశి జాతకులు దూరంగా ఉండాలి. ఏ పని చేసినా కన్యా రాశి వారు జాగ్రత్తగా వ్యవహరించాలి.
మీన రాశి
మీన రాశి జాతకులకు కెరీర్లో ఆకస్మిక మార్పులు ఎదురయ్యే అవకాశం ఉంది. మీన రాశి వారికి కొత్త బాధ్యతలు వచ్చి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఊహించని విధంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి బడ్జెట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులు, బంధువులతో గొడవలు లేకుండా చూసుకోవాలి. మీన రాశి వారికి ఈ సమయం ఏ విధంగానూ లబ్ది చేకూర్చదు.
గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.













Click it and Unblock the Notifications