Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వాలెంటైన్స్ డే.. ఏ రాశి వారు ఏం గిఫ్ట్ ఇస్తే లవర్ హ్యాపీ అవుతారంటే!

ఫిబ్రవరి మాసం ప్రేమికులకు అత్యంత ఇష్టమైన మాసం. ఈ నెలలో చాలామంది తాము ప్రేమించే వారికి లవ్ ప్రపోజ్ చేస్తారు. ఇక ఫిబ్రవరి 14వ తేదీ వాలెంటెన్స్ డే రోజు తమ ప్రేమని వ్యక్తపరచడానికి రకరకాల బహుమతులు ఇచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

వాలంటైన్స్ డే... ఏ రాశులవారు ఏం గిఫ్ట్స్ ఇవ్వాలి?
ప్రేమికుల రోజున ప్రేమను వ్యక్తపరచడం వల్ల భాగస్వామితో బంధం బలపడుతుందని చాలామంది నమ్ముతారు. ఇక వాలెంటెన్స్ డే రోజు ప్రేమికులు తమకు ఇష్టమైన వారికి గిఫ్ట్ లు ఇవ్వాలంటే ఏం గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది? ముఖ్యంగా ఏ రాశి వారు ఏ గిఫ్ట్ ఇస్తే లవర్ ను మెప్పించగలుగుతారు? అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.

మేషరాశి
ప్రేమికుల రోజున మేషరాశి జాతకులు ప్రేమ భాగస్వామికి ఎరుపు రంగు బహుమతులను ఇవ్వాలి. ఎరుపు రంగు దుస్తులను కూడా బహుమతిగా ఇవ్వచ్చు. ఇవి ఇస్తే లవర్ ప్లాట్ అవడం తప్పక జరుగుతుంది.

Valentine s Day What gift will make your lover happy if you give it to each zodiac sign

వృషభ రాశి
వృషభ రాశి జాతకులు ప్రేమికుల రోజున తమకు ఇష్టమైన వారికి తెలుపు లేదా గోధుమ లేదా ఖాకీ రంగు వస్తువులను బహుమతిగా ఇవ్వాలి. ఈ రంగు బహుమతులు వారి ప్రేమ బంధాన్ని బలోపేతం చేస్తాయి.

మిధున రాశి
మిధున రాశి వారు ప్రేమికుల రోజున తమ జీవిత భాగస్వామికి ఆకుపచ్చ రంగు బహుమతులను ఇస్తే బాగుంటుంది. ఇది వారిద్దరి మధ్య ప్రేమను మరింత పెంచుతుంది.

కర్కాటక రాశి
కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కాబట్టి కర్కాటక రాశి వారు తమ జీవిత భాగస్వామికి తెల్లటి వస్తువులను, తెల్లటి గులాబీలను ఇవ్వడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది వీరి మధ్య ప్రేమని పెంపొందిస్తుంది

సింహరాశి
సింహ రాశి వారు వాలెంటైన్స్ డే రోజున తమ ప్రేమికులకు పసుపు, ఎరుపు పువ్వులు గాని, చెవి కమ్మలు గాని బహుమతిగా ఇస్తే మంచిది. ఇవి ఇవ్వడం వల్ల వారు సంతోషంగా ఉంటారు.

కన్యారాశి
ప్రేమికుల రోజు సందర్భంగా కన్యా రాశి వారు తమకు ఇష్టమైన వారికి నీలం రంగు వస్తువులను బహుమతిగా ఇస్తే మంచిది. దీనివల్ల ప్రేమికులు ఒకరికొకరు మరింత ఆకర్షణతో ఉంటారు.

తులారాశి
తుల రాశి వారు వాలెంటైన్స్ డే రోజున తమ ప్రేమ భాగస్వామికి కమలం పువ్వును బహుమతిగా ఇస్తే మంచిది. అది తులా రాశి జాతకులకు ఎంతో శుభాలను చేకూరుస్తుంది.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు ప్రేమికుల రోజున తమ ప్రేమ భాగస్వామికి ఎరుపు లేదా మెరూన్ రంగు దుస్తులను బహుమతిగా ఇస్తే మంచిది. ఇది వారికి ఒకరిపై ఒకరికి ఆకర్షణను పెంచుతుంది.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారు తమ జీవిత భాగస్వామికి వాలెంటైన్స్ డే రోజున బంగారు ఉంగరాన్ని బహుమతిగా ఇస్తే మంచిది. దీనివల్ల వారు చేసిన కష్టానికి తగిన గుర్తింపు ఉండడమే కాకుండా ప్రేమ భాగస్వామి కూడా సంతోషపడతారు.

మకర రాశి
మకర రాశి వారు ప్రేమికుల రోజున తమ ప్రియమైన వారికి నీలిరంగు గులాబీలను ఇవ్వడం ఎంతో మంచిది. నీలిరంగులో ఉండే వస్తువులను ఇచ్చిన మంచి ఫలితం ఉంటుంది. వీరి మధ్య ప్రేమ బంధం బలపడుతుంది.

కుంభరాశి
కుంభ రాశి వారు తమ ప్రేమ భాగస్వామికి దుస్తులు లేదా కార్డు వాలెంటైన్స్ డే రోజున బహుమతిగా ఇస్తే చాలా మంచిది. దీనివల్ల ఇష్టమైన వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. ప్రేమ మరింత పెరుగుతుంది.

మీనరాశి
మీన రాశి వారు తమకు ఇష్టమైన వారికి పసుపు, గులాబీ దుస్తులు వాలెంటైన్స్ డే రోజు గిఫ్ట్ ఇవ్వడం చాలా మంచిది. మీన రాశి వారు ఈ గిఫ్ట్ ను ఇచ్చి లవ్ ప్రపోజ్ చేస్తే లవర్ ఫ్లాట్ అవ్వాల్సిందే.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+