vastu tips: దాంపత్య జీవితం సుఖంగా ఉండాలంటే బెడ్ రూమ్ లో వీటిని నివారించండి!!
ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే , వాస్తు నియమాలను సరిగా పాటించకపోతే ఆ కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ముఖ్యంగా బెడ్రూమ్ విషయంలో వాస్తు దోషాలు ఉంటే, వాస్తు నియమాలను పాటించకుండా కొన్ని వస్తువులను పెట్టుకుంటే ఆ ఇంట్లో నివసించే భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది. ఇద్దరి మధ్య తరచూ గొడవలు అయ్యే ఆస్కారం ఉంటుంది. ఇది దాంపత్య జీవితానికి చేటు చేస్తుంది.
కాబట్టి దాంపత్య జీవితం సుఖంగా ఉండాలి అనుకునే వారు కొన్ని వాస్తు నియమాలను తప్పకుండా పాటించాలి. భార్యాభర్తల దాంపత్య జీవితం సుఖంగా ఉండాలంటే వారు బెడ్రూంలో కొన్ని వస్తువులను నిరోధించాలి. బెడ్రూంలో దేవుళ్ళ ఫోటోలు పెట్టుకోవడం మంచిది కాదు. అలా పెట్టుకోవడం వల్ల భార్య భర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది. ఆనంద గ్రహం అయిన శుక్రుడు బెడ్ రూమ్ ని పాలిస్తాడు.

శుక్రుడు నివసించే చోట బృహస్పతి ఉనికి అశుభంగా పరిగణించబడుతుంది. కాబట్టి కచ్చితంగా బెడ్రూంలో దేవుళ్ళ ఫోటోలు తీసి వేయాలి. బెడ్ రూమ్ లో పొరపాటున కూడా వన్యప్రాణులకు సంబంధించిన ఫోటోలు, క్రూర మృగాలకు సంబందించిన ఫోటోలు పెట్టకూడదు. జంతువులకు సంబంధించిన బొమ్మలు కూడా పెట్టడం మంచిది కాదు. అది భార్యాభర్తల మధ్య సంఘర్షణలకు కారణమవుతుంది. కాబట్టి బెడ్రూంలో ఇటువంటి చిత్రాలను పెట్టటం ఖచ్చితంగా నివారించాలి.
ఇక బెడ్ రూమ్ లో ఎలక్ట్రానిక్ వస్తువులను నివారించటం మంచిది. మనుషులతో మాట్లాడ కుండా లాప్టాప్ చూసుకుంటూ, మొబైల్ ఫోన్ లో చాటింగ్ చేస్తూ చాలా మంది జీవిస్తున్నారు. ఇది భార్యాభర్తల మధ్య గ్యాప్ పెంచుతుంది. అందుకే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసం బెడ్రూంలో ఎలక్ట్రానిక్ వస్తువులను నివారించటం మంచిది.

ఇదే సమయంలో బెడ్ రూమ్ లో చాలామంది బెడ్ ను రూమ్ లో ఒక మూలకు వేస్తూ ఉంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. బెడ్ రూమ్లో బెడ్ రూమ్ మధ్యలో ఉండాలి. చుట్టూ నడవడానికి వీలుగా ఖాళీ ఉండాలి. అలా ఉన్నప్పుడే సానుకూలత ఉంటుంది. కాబట్టి బెడ్ రూమ్ లో బెడ్ ఎక్కడ వెయ్యాలి అన్న విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి.












Click it and Unblock the Notifications