vastu tips: బాత్‌రూమ్ లో ఉంచిన ఈ వస్తువులతో దురదృష్టం.. వెంటనే తీసెయ్యండి!!
ఇల్లు కట్టుకోవాలి అనుకున్నప్పుడు వాస్తు నియమాలు పాటించాలి. ఏ దిశలో ఏ ఏ గదులు కట్టాలి అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. వాస్తు నియమాలను అనుసరించి ఇల్లు కట్టుకోవడం మాత్రమే కాదు ఇంట్లో పెట్టుకునే వస్తువుల విషయంలో కూడా వాస్తు నియమాలను పాటించాలి. వాస్తు నియమాలను అనుసరించి ఇంట్లో వస్తువులను పెట్టుకోకపోతే ప్రతికూల పరిస్థితులు వస్తాయి. తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
కుటుంబసభ్యుల ఆరోగ్యం పాడు కావడం, ఆర్థిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపడం వంటి అనేక ఇబ్బందులు బాత్రూంలో వాస్తు సరిగా లేకపోతే చోటు చేసుకుంటాయి. కాబట్టి మనం బాత్రూం వాస్తు విషయంలో కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. సంతోషం మరియు శ్రేయస్సు కొనసాగించాలంటే బాత్రూంలో ఉండాల్సిన వస్తువులపైన కచ్చితంగా అవగాహన ఉండాలి. ఉండకూడని వస్తువులు బాత్రూంలో ఉంటే తక్షణం తొలగించాలి. అసలు బాత్రూంలో ఎటువంటి వస్తువులు ఉండకూడదో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

బాత్రూంలో ఎప్పుడు విరిగిపోయిన అద్దాలు ఉండకూడదు. విరిగిపోయిన అద్దాలు, పగిలిపోయిన అద్దాలు బాత్రూంలో ఉంటే అవి ప్రతికూలతలను సృష్టిస్తాయి. బాత్రూంలో ఎప్పుడు బకెట్లు ఖాళీగా ఉంచకూడదు. ఖాళీ అయిన బకెట్ ను బోర్లించి పెట్టాలి. ఖాళీగా బకెట్ ఉంటే అది కూడా ఇంట్లో డబ్బులను ఖాళీ చేస్తుంది. ఇక విరిగిపోయిన, పగిలిపోయిన బకెట్లు, మగ్గులు బాత్రూంలో పొరపాటున కూడా ఉంచకూడదు.
బాత్రూంలో చాలా మంది మొక్కలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే బాత్రూంలో మొక్కలు పెట్టడం ఏ మాత్రం మంచిది కాదు. బాత్రూంలో మొక్కలు ఎండిపోయినవి కూడా ఉండకూడదు. దీనివల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వస్తుంది. బాత్రూంలను చాలా మంది అందంగా ఉంచడం కోసం రకరకాల చిత్రాలతో డెకరేట్ చేస్తారు. ఇక చినిగిపోయిన చిత్రాలను బాత్రూంలో పొరపాటున కూడా ఉంచకూడదు. అలా ఉంటే కుటుంబ కలహాలు వస్తాయి.
బాత్రూంలో ట్యాప్ ఎప్పుడు లీక్ కాకూడదు. ఒకవేళ బాత్రూంలో ట్యాప్ లీక్ అయితే అది ప్రతికూల శక్తిని వ్యాపింప చేస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి కూడా చెడుగా ప్రభావితమవుతుంది. బాత్రూంలో చాలామంది మురికి బట్టలు, తడి బట్టలు వదిలేస్తుంటారు. అయితే అది ఏమాత్రం మంచిది కాదు. బాత్రూంలో మురికి బట్టలు, తడి బట్టలు ఉంటే వాస్తు దోషంతో పాటు సూర్య దోషం కూడా కలుగుతుంది. తీవ్రమైన అనారోగ్యాల బారిన పడి ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications