vastu tips: హోలీ నాడు వీటితో ఆర్ధిక ఇబ్బందులకు చెక్.. ట్రై చెయ్యండి!!

హోలీ పండుగ నాడు ఇంటికి కొన్ని వస్తువులను తెచ్చుకుంటే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని అంటున్నారు.

హోలీ పండుగ వస్తుందంటే చాలు చాలామంది రంగుల పండుగ హోలీని జరుపుకోవడానికి ఇప్పటినుంచి ఏర్పాట్లు మొదలు పెడతారు. ఈ సంవత్సరం మార్చి 8వ తేదీన హోలీ పండుగ జరుపుకోనున్న నేపథ్యంలో రంగుల పండుగకు రెడీ అవుతున్నారు ప్రజలు.

దేశంలో దీపావళి పండుగ తర్వాత అత్యంత ఘనంగా జరుపుకునే హోలీ పండుగకు సంతోషాలను ఇంటికి ఆహ్వానించడానికి సిద్ధమవుతున్నారు. అయితే హోలీ పండుగ నాడు ఇంటికి కొన్ని వస్తువులను తెచ్చుకుంటే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని, ఆ ఇంట్లో సంవత్సరమంతా సంపద ఉంటుందని చెబుతున్నారు పండితులు.

 హోలీ నాడు ఈ వస్తువులతో ఆర్ధిక ఇబ్బందులకు చెక్

హోలీ నాడు ఈ వస్తువులతో ఆర్ధిక ఇబ్బందులకు చెక్

హోలీ పౌర్ణమి రోజున ఇంటికి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే ఆర్థిక ఇబ్బందులకు చెక్ పడుతుందని, సంతోషంగా జీవించడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. హోలీ పండుగ నాడు వెండి నాణాన్ని, వెండి పట్టీలను, వెండి ఉంగరాన్ని కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే బాగా కలిసి వస్తుందని చెబుతున్నారు. హోలీ పండుగ నాడు కొనుగోలు చేసిన వెండి నాణాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల, వెండి పట్టీలను కాళ్లకు ధరించడం వల్ల, వెలికి వెండి ఉంగరం పెట్టుకోవటం వల్ల లక్ష్మీ ఇంటికి నడుచుకుంటూ వస్తుందని, లక్ష్మీదేవి కటాక్షం దొరుకుతుందని చెబుతున్నారు.

హోలీనాడు ఇంటికి ఇవి తెచ్చుకోండి.. వాస్తు దోషాలు పోతాయి

హోలీనాడు ఇంటికి ఇవి తెచ్చుకోండి.. వాస్తు దోషాలు పోతాయి

ఇక అంతే కాదు హోలీ పండుగ నాడు ఇంటి ప్రధాన ద్వారానికి తోరణాలను కట్టడం కూడా లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతుందని అంటున్నారు. హోలీ పండుగ నాడు ఇంటికి కొత్త అక్వేరియం తెచ్చుకుని దానిని సరైన దిశలో పెట్టి 9 చేప పిల్లలను వేసి పెంచితే కలిసి వస్తుందని చెబుతున్నారు. ఇంటికి తీసుకువచ్చిన అక్వేరియాన్ని ఇంటికి ఉత్తర దిశలో కానీ ఈశాన్య దిశలో కానీ ఉంచి చేపలను పెంచడం వల్ల ఇంట్లో ఉండే వాస్తు దోషాలు తొలగిపోతాయని చెబుతున్నారు.

ఇంట్లో సానుకూల శక్తి కోసం వీటిని తెచ్చుకోండి

ఇంట్లో సానుకూల శక్తి కోసం వీటిని తెచ్చుకోండి

ఇక హోలీ పండుగ నాడు ఇంట్లో వెదురు మొక్కను తెచ్చి పెట్టడం శుభప్రదంగా చెబుతారు. ఇంట్లో వెదురు మొక్కను పెట్టడం వల్ల ప్రతికూల శక్తి నాశనమవుతుందని, హోలీ ముందు ఈ మొక్కను ఇంటికి తెచ్చుకొని, ఈ మొక్క ప్రభావంతోటి ఇంటికి సానుకూల శక్తిని ఆహ్వానించాలని చెబుతున్నారు. ఇక హోలీ పండుగ నాడు ఇంట్లో క్రిస్టల్ తాబేలు తెచ్చి పెట్టుకుంటే అంతా మంచే జరుగుతుందని అంటున్నారు. ఇంట్లో తాబేలుని పెట్టడం వల్ల సానుకూల శక్తి వస్తుందని, ఆర్థిక పురోగతి బాగా ఉంటుందని సూచిస్తున్నారు.

 హోలీ నాడు చైనీస్ వాస్తు ప్రకారం ఇది తెచ్చుకుంటే లక్

హోలీ నాడు చైనీస్ వాస్తు ప్రకారం ఇది తెచ్చుకుంటే లక్

అంతేకాదు హోలీ పండుగ నాడు చైనీస్ వాస్తు ప్రకారం ఇంట్లోకి డ్రాగన్ విగ్రహాన్ని లేదా చిత్రాన్ని తీసుకురావడం శుభప్రదంగా పరిగణిస్తారు. హోలీ పండుగ నాడు ఇలా చేయడం వల్ల ఇంట్లోని సభ్యులపై చెడు ప్రభావం ఉండదని, ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు హోలీ పండుగ నాడు రంగుల హోలీని ఇంటి ప్రాంగణంలోనే జరుపుకుంటే అదృష్టం కలిసి వస్తుందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+