Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

2024లో మీ ఇంటికి ఈ వస్తువులు తెచ్చుకుంటే ఏడాదంతా డబ్బే డబ్బు!!

2023 సంవత్సరం ముగిస్తోంది. 2024 సంవత్సరానికి స్వాగతం పలకడానికి ప్రపంచమంతా ఎదురుచూస్తుంది. అయితే 2024 సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, వారు అనుకున్న పనులు సత్ఫలితాలను ఇవ్వాలని, సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటారు. అలా తాము అనుకున్న పనులన్నీ నెరవేరి లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే ఓ నాలుగు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

వాస్తు శాస్త్రంలో ఇంట్లో పెట్టుకునే వస్తువులకు ఒక విశేషమైన స్థానం ఉంటుంది ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకోవడం మాత్రమే కాకుండా ఇంట్లో పెట్టుకునే వస్తువుల విషయంలో కూడా వాస్తు నియమాలను పాటించాలి. అలా పాటించినప్పుడే సత్ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. 2023 సంవత్సరం ముగిసి 2024 సంవత్సరం రాబోతున్న తరుణంలో మనం ఇంట్లో పెట్టుకోవలసిన కొన్ని వాస్తు సంబంధమైన వస్తువులను గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

Vastu tips: bring these things to your home in 2024 to get money whole year

2024 సంవత్సరంలో ఇంట్లో సుఖ సంతోషాలు ఉండడానికి లక్ష్మీదేవి ప్రసన్నం కావడానికి ఇంటికి ఒక మెటల్ తాబేలును తీసుకువచ్చి పెడితే మంచిదని చెబుతున్నారు. తాబేలు ఇంట్లో ఉంటే లక్ష్మీ నివాసం ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు బలంగా నమ్ముతారు. అంతేకాదు ఇంట్లో తులసి మొక్కను పెట్టడం వల్ల కూడా లక్ష్మీ నివాసం ఉంటుందని చెబుతారు.

లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలనుకునే వారు, సంతోషంగా జీవించాలి అనుకునేవారు 2024 సంవత్సరంలో ఇంట్లో తులసి మొక్కను నాటండి. ఇక 2024 సంవత్సరంలో తెచ్చుకోవలసిన మరొక వస్తువు విషయానికి వస్తే నెమలి ఈకలు. ఇవి ఇంట్లో ఉండడం వల్ల లక్ష్మీ కటాక్షం ఉంటుందని, ఇవి మన జీవితంలో కలిగే అడ్డంకులను తొలగించడానికి ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతారు కాబట్టి కచ్చితంగా ఇంట్లో నెమలీకలను పెట్టుకోవడం శుభసంకేతం.

కొత్త సంవత్సరం ఇంటికి శంఖాన్ని తెచ్చి పెడితే మంచిదని చెబుతున్నారు. శంఖంతో విష్ణుమూర్తిని పూజిస్తే ఇంటికి మంచి జరుగుతుందని, ధన లాభం కలుగుతుందని చెబుతున్నారు. కాబట్టి కొత్త సంవత్సరం ప్రారంభంలో ఈ వస్తువులను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి కటాక్షం వల్ల సంవత్సరం అంతా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటారని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+