vastu tips: అసలు నిద్ర పట్టట్లేదా? అయితే నిద్రించేముందు ఈ చిట్కాలు ట్రై చెయ్యండి!!
చాలామంది నిద్ర విషయంలో అసౌకర్యానికి గురవుతూ ఉంటారు. ప్రశాంతంగా నిద్ర పోలేని స్థితిలో ఉంటారు. అటువంటివారు కొన్ని వాస్తు నియమాలను పాటించడం ద్వారా చక్కని ప్రయోజనాన్ని పొందుతారు.
ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషంగా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటారు. ఇక వాస్తు శాస్త్రం కూడా ఇంట్లో సుఖశాంతులతో ఉండటం కోసం ఏ విధమైన నియమాలు పాటించడం అవసరమో తెలియజేస్తుంది. వాస్తు శాస్త్రం ఆ కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం నిర్దేశించబడింది. వాస్తు శాస్త్ర నియమాలను అనుసరించడం ద్వారా ఎప్పుడు సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒక మనిషి సంతోషంగా జీవించాలంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉండడం, ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండడం, హాయిగా నిద్రపోగలగడం చాలా ముఖ్యం.

నిద్ర పోయేందుకు పాటించాల్సిన వాస్తు నియమాలు
అయితే చాలామంది నిద్ర విషయంలో అసౌకర్యానికి గురవుతూ ఉంటారు. ప్రశాంతంగా నిద్ర పోలేని స్థితిలో ఉంటారు. అటువంటివారు కొన్ని వాస్తు నియమాలను పాటించడం ద్వారా చక్కని ప్రయోజనాన్ని పొందుతారు. మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొంది బాగా నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఆ నియమాలు ఏంటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మంచి నిద్ర కావాలంటే ఈ పనులు చెయ్యండి
రాత్రిపూట మంచి నిద్ర పోవడానికి, నిద్రపోయే ముందు మీ తల వద్ద పవిత్రమైన మతపరమైన పుస్తకాన్ని ఉంచుకోవాలని సూచించబడింది. ఇలా చేయడం వల్ల జీవితంలో సంతోషం కలుగుతుందని, అదే సమయంలో నిద్ర పోతున్నప్పుడు చెడుకలలు రాకుండా ఉంటాయని చెప్పబడింది. హిందువులు అయితే భగవద్గీతను పక్కన పెట్టుకోవడం మంచిదని సూచించబడింది. జీవితంలో శాంతి కోసం, ప్రశాంతమైన నిద్ర కోసం మంచం దగ్గర సువాసన గలిగిన పువ్వులను కూడా పెట్టుకోవచ్చని, మల్లెపూలు, జాజిపూలు, సంపంగి పూలు వంటి సువాసన వచ్చే పువ్వులను పెట్టుకోవడం వల్ల మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుందని చెప్పబడింది.

వీటిని మంచం దగ్గర పెట్టుకుంటే గ్రహదోషాలు పోతాయి
నిద్రలో పీడకలలు వస్తుంటే, ప్రశాంతంగా నిద్ర పోలేక పోతుంటే మంచం దగ్గర ఇనుప వస్తువులను పెట్టుకుంటే మంచిదని సూచించబడింది. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా బాగా నిద్రపోవాలి అనుకుంటే నిద్ర కోసం ఒక గుడ్డలో కొన్ని యాలుకలను మూటకట్టి దానిని మంచం కింద పెడితే ఏవైనా గ్రహదోషాలు ఉంటే తొలగిపోతాయని చెప్పబడింది.

నిద్రించే దిశ విషయంలో జాగ్రత్త .. దక్షిణ, ఉత్తర దిశల్లో నిద్రిస్తే ఫలితం ఇలా
అంతే కాదు నిద్రించే దిశ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని వాస్తు శాస్త్రం చెబుతుంది . దక్షిణానికి అధిపతి మృత్యుదేవుడు యముడు కావడంతో ఆ దిశ వైపు తలపెట్టి నిద్రించడం ఉత్తమమని, ఆరోగ్యాన్ని కోరుకునే వ్యక్తి ఎప్పుడూ దక్షిణం వైపు తల, ఉత్తరం వైపు పాదాలు ఉంచి నిద్రించాలని వాస్తు శాస్త్రం సూచించింది. ఈ దిశలో తలపెట్టి నిద్రించడం వల్ల మనిషికి ఐశ్వర్యం, ఆనందం, కీర్తి లభిస్తాయి. మంచి సుఖవంతమైన నిద్ర కూడా సొంతమవుతుంది. ఇక ఉత్తరం వైపు తలపెట్టి నిద్రించడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. ఉత్తరానికి అధిపతి సంపదలకు అధిపతి అయిన కుబేరుడు కాబట్టి ఆ దిశలో తలపెట్టి పడుకోవడం ఏమాత్రం మంచిది కాదు. దీనివల్ల తలనొప్పి వస్తుంది తలను ఉత్తరం వైపు, దక్షిణం వైపు పాదాలు ఉంచి నిద్రించేవారు వ్యాధిగ్రస్తులవుతారు. పొరపాటున కూడా ఈ దిశలో తలపెట్టి నిద్రపోవడం మంచిది కాదని సూచించబడింది.

తూర్పు,పడమర దిశల్లో నిద్రిస్తే ఫలితం ఇలా
ఇక తూర్పు దిక్కుకు అధిపతి దేవతలకు రాజు అయిన ఇంద్రుడు. ఈ దిశలో తలపెట్టి నిద్రపోతే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగుపడతాయి. ఆధ్యాత్మికత కూడా పెరుగుతుంది. నిద్ర లేవగానే ఈ దిక్కుని చూసి దేవేంద్రుడి ఆశీస్సులను పొందుతారు. ఇక ఇదే సమయంలో పడమర దిక్కు వైపు తలపెట్టి పడుకోవడం కూడా మంచి అనుకూలమైన ప్రభావాలనే ఇస్తుంది. వాస్తు ప్రకారం పడమర దిశలో తల ఉంచి నిద్రించడం కూడా అనుకూలమైనది ఎందుకంటే ఈ దిశలో పేరు, కీర్తి, ప్రతిష్ట మరియు శ్రేయస్సు పెరుగుతాయి. నిద్రించే విషయంలో తగిన వాస్తు జాగ్రత్తలు తీసుకుంటే హాయిగా నిద్రపోవడంతో ఆరోగ్యం కూడా బాగుంటుందని, తద్వారా కుటుంబం సంతోషంగా జీవించడానికి అవకాశం ఉంటుందని చెప్పబడింది.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
మిథున రాశి, కర్కాటక రాశి మే నెల జాతక ఫలం -
జన్మ నక్షత్రం పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం ఇంట్లో చపాతీలను లెక్కపెట్టి చేస్తే పరమ దరిద్రం -
ఈ ఫోటోలో "పిజ్జా" పీస్ ఎక్కడుందో కనిపెట్టగలరా ? -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం..












Click it and Unblock the Notifications