vastu tips: ఇంట్లో చనిపోయినవారి ఫొటోలు ఉండకూడదు.. నిజమేనా?

హిందూ సాంప్రదాయం, వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో చనిపోయిన మన పెద్దల ఫోటోలను ఉంచడానికి కొన్ని నిర్దిష్టమైన నియమాలు ఉన్నాయి. తప్పుడు దిశలో ఫోటోలు పెట్టడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతుంటారు. వాస్తు ప్రకారం చనిపోయినవారి ఫోటోలను ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదో తెలుసుకుందాం.

ఏ దిశలో పెట్టాలి?

వాస్తు ప్రకారం పితృదేవతలకు అధిపతి యముడు. ఆయన దిశ దక్షిణ దిశ. కాబట్టి, చనిపోయినవారి ఫోటోలను ఇంటి దక్షిణ గోడకు తగిలించాలి. దీనివల్ల ఆ ఫోటోలు ఉత్తర దిశ వైపు చూస్తున్నట్లు ఉంటాయి. దక్షిణ గోడ వీలు కాకపోతే, పశ్చిమ గోడ లేదా నైరుతి మూల గోడలపై కూడా పెట్టవచ్చు.

Vastu tips Can You Display Photos of Departed Loved Ones at Home Understanding Common Beliefs

ఎక్కడ పెట్టకూడదు?

చాలామంది చేసే పొరపాటు ఇది. దేవుళ్లు, పితృదేవతలు ఇద్దరూ సమానం కారు. వాస్తు ప్రకారం దేవుళ్ల పటాల పక్కన లేదా పూజ గదిలో చనిపోయినవారి ఫోటోలు పెట్టకూడదు. దీనివల్ల దైవ అనుగ్రహం తగ్గుతుందని నమ్ముతారు. ఇంటి నడిబొడ్డున లేదా హాల్ మధ్యలో అందరికీ స్పష్టంగా కనిపించేలా పెద్దల ఫోటోలు పెట్టకూడదు. వాటిని చూసినప్పుడల్లా ఇంట్లో ఉన్నవారికి బాధ, నిరాశ కలుగుతాయి.

బెడ్‌రూమ్ లేదా కిచెన్

పడకగది, వంటగది లో చనిపోయినవారి ఫోటోలు అస్సలు పెట్టకూడదు. దీనివల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణించడం, దంపతుల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది. ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా కానీ, మెట్ల కింద కానీ ఈ ఫోటోలను ఉంచకూడదు. ఇంట్లో బతికున్నవారి ఫోటోలతో పాటు, చనిపోయినవారి ఫోటోలను కలిపి ఒకే ఫ్రేమ్‌లో లేదా పక్కపక్కనే పెట్టకూడదు.

ఇది బతికున్నవారి ఆయుష్షుపై, ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. చనిపోయిన వ్యక్తికి సంబంధించిన ఒకటి కంటే ఎక్కువ ఫోటోలను ఇల్లంతా పెట్టకూడదు. పితృదేవతల ఫోటోలపై దుమ్ము, ధూళి చేరకుండా నిరంతరం శుభ్రం చేస్తూ ఉండాలి. వీలైతే వారి పుట్టినరోజు లేదా వర్ధంతి రోజుల్లో మాత్రమే ఫోటోలకు పూలదండలు వేయాలి, నిత్యం పూలదండలు ఉంచకూడదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+