ఆ షాట్ కోసం 90 టేకులు.. మహేశ్ కు చుక్కలు చూపించిన రాజమౌళి..!
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి- సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మకమైన చిత్రం 'వారణాసి' ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాను శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కే.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ ప్రొడక్షన్ షోయింగ్ బిజినెస్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మలయాళ నటుడు పృథ్వీరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దేశ సినిమా చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా దాదాపు రూ.1200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
వారణాసి మూవీ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల వారణాసి చిత్ర విశేషాలను మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. షూటింగ్ విశేషాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి. తన కెరీర్ లో చూసిన గొప్ప దర్శకుల్లో రాజమౌళి ఒకరని తెలిపారు. దర్శకుడిగా మాత్రమే కాకుండా, ఆయన అద్భుతమైన నటుడు అని పేర్కొన్నారు. షూటింగ్ ప్రారంభానికి ముందే సెట్స్ కు వచ్చి.. షూటింగ్ పూర్తయి అందరూ వెళ్లాక చివరిగా వెళ్లేది కూడా ఆయనేనని తెలిపారు.

రాజమౌళిలో ఎప్పుడూ కొత్త దర్శకుడిలో ఉన్న కసి, పట్టుదల ఉండేదని పృథ్వీరాజ్ పేర్కొన్నారు. షూటింగ్ సమయంలో లంచ్ బ్రేక్ కూడా కేవలం 20 నిమిషాలే ఉండేదని కీలక విషయాలను పంచుకున్నారు. ఒక్కోసారి రాజమౌళి వివరించే సీన్స్ తనకు అర్థం అయ్యేవి కావని.. ఆయనకున్న గొప్ప విజన్.. తన నటనకు మధ్య సెట్స్ లో చిన్నపాటి యుద్ధమే జరిగేదని స్పష్టం చేశారు. వారణాసిలో ఓ పర్టికులర్ షాట్ కోసం మేము ఏకంగా 90 నుండి 97 కంటే ఎక్కువ టేకులు తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక వారణాసి మూవీలో మహేశ్ 'రుద్ర' పాత్రలో నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ' అనే పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications