Vastu tips: మీ పర్సులో, లాకర్లలో ఈ ఒక్క వస్తువుతో డబ్బు సమస్యలకు చెక్!!
మన జీవితంలో ఉండే ఆర్థిక ఇబ్బందులు పోవాలంటే, రాహు, కేతు దోషాల నుంచి, గురు గ్రహానికి సంబంధించిన వాస్తు దోషాల నుంచి బయటపడాలంటే పర్సులో ఒక వస్తువును పెట్టుకోవాలని సూచిస్తున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.
మనిషి సంతోషంగా జీవించాలంటే, ఆర్థిక ఇబ్బందులు లేకుండా హాయిగా ఉండాలంటే, వాస్తు శాస్త్రం గురించి, పాటించవలసిన వాస్తు నియమాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జీవితంలో అనేక సమస్యలను అధిగమించటానికి చిన్న చిన్న వాసు టిప్స్ పాటించటం ఎంతగానో ఉపయోగపడుతుంది. మన జీవితంలో ఉండే ఆర్థిక ఇబ్బందులు తొలగి పోవాలంటే, రాహు కేతు, దోషాల నుంచి, గురు గ్రహానికి సంబంధించిన వాస్తు దోషాల నుంచి బయటపడాలి అంటే పర్సులో ఒక వస్తువును పెట్టుకోవాలని సూచిస్తున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఆ ఒకే ఒక వస్తువుని పెట్టుకోవడం వల్ల ఈ దోషాల నుంచి విముక్తి లభించడమే కాకుండా, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతున్నారు.

జీవితంలో అనేక సమస్యలను తొలగించే గొప్ప వస్తువు ఇదే
ఇంతకీ పర్సులో పెట్టుకోవాల్సిన ఆ ముఖ్యమైన వస్తువు ఏమిటి అంటే.. పసుపు. పసుపు కొమ్మును కానీ, చిన్న పసుపు ముద్దను కానీ పర్సులో పెట్టుకోవడం వల్ల ఎన్నో దోషాలు తొలగిపోతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. భారతీయులు ఇళ్లల్లో ప్రతిరోజు ఉపయోగించే సుగంధ ద్రవ్యం పసుపు. పసుపు అనేక ఔషధ గుణాలు కలిగి ఉండడమే కాకుండా, పసుపు కు జ్యోతిష్య మరియు వాస్తు శాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా మనం పూజలు, శుభకార్యాలు చేసే క్రమంలో పసుపును వినియోగిస్తాము. ఇక ఇదే సమయంలో పసుపును అనేక వాస్తు దోష నివారణకు కూడా ఉపయోగిస్తారు. పసుపు మన జీవితంలో ఉన్న అనేక సమస్యలను తొలగించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది.

ఈ వస్తువు పర్సులో పెట్టుకుంటే ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోతాయి
పసుపును పర్సులో పెట్టుకోవడం వల్ల కలిగే మేలు ఏంటి? ఏ దోషాల నుంచి మనకు విముక్తి లభిస్తుంది అంటే.. పర్సులో పసుపు ముద్దని పెట్టుకోవడం వల్ల గురు గ్రహానికి సంబంధించిన దోషాలు తొలగిపోతాయి. పర్సులో పసుపు ముద్దని పెట్టుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు దూరం అవుతాయి. మీ పర్సు ఎప్పటికీ ఖాళీగా ఉండదు. ఎక్కడైనా రాకుండా ఇబ్బంది పెడుతున్న డబ్బు కూడా తిరిగి వచ్చేస్తుంది. పసుపును పర్సులో పెట్టుకోవడం వల్ల రాహు, కేతు దోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది.

పర్సులోనే కాదు లాకర్లలోనూ ఈ వస్తువును పెట్టుకుంటే మేలు
పసుపుతో లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. పసుపు ముద్దను పర్సులో మాత్రమే కాకుండా, ఇంట్లో మనం డబ్బులు పెట్టే బీరువాలు, లాకర్లలో కూడా పెట్టుకోవడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. ఇక వాస్తు శాస్త్రం మాత్రమే కాకుండా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పసుపు గురు గ్రహానికి సంబంధించినది. గురు గ్రహం మన జీవితాన్ని మరియు ఆరోగ్యాన్ని రక్షించడంలో కీలకపాత్ర పోషించే గ్రహం. అందుకే పసుపు ముద్దను ఎప్పుడు మన లాకర్లలో ఉంచుకుంటే మంచిదని చెప్తున్నారు.

ఎరుపు లేదా పసుపు క్లాత్ లో ఈ వస్తువును చుట్టి పెట్టండి.. ఫలితం మీరే చూడండి
ముఖ్యంగా పసుపును ఎరుపు లేదా పసుపు గుడ్డలో చుట్టి ఉంచినట్లయితే అది మరింత శుభప్రదంగా ఉంటుందని, ఎంతో మేలు చేకూరుస్తుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. మరి ఇంకెందుకు ఆలస్యం.. పర్సులో మాత్రమే కాకుండా, ప్రతి ఒక్కరు ఇళ్లల్లో డబ్బులు పెట్టుకునే లాకర్ల లోను, బీరువాల్లోనూ దోషాలను తొలగించే పసుపు ముద్దను పెట్టుకోండి. పసుపు చేసే అద్భుతాలను మీరే నేరుగా చూడండి.












Click it and Unblock the Notifications