vastu tips: దీపావళికి ఇంటిని అలంకరిస్తున్నారా? మొక్కలు, డెకరేషన్ విషయంలో వాస్తునియమాలు పాటించండి!!

దీపావళి పండుగకు సమయం దగ్గర పడుతోంది. దీపావళి పండుగకు ఇంటికి అలంకరించడానికి, ముస్తాబు చేయడానికి ఇప్పటికే అందరూ రెడీ అయిపోతూ ఉంటారు. ఈ సంవత్సరం దీపావళి పండుగ అక్టోబర్ 24వ తేదీన వస్తుంది. దీపావళి పండుగకు ఇంటిని చక్కగా అలంకరించుకోవడంతో పాటుగా పండుగ సందర్భంగా కేదారేశ్వర వ్రతాన్ని చేసుకోడానికి కూడా చాలామంది ఇప్పటినుంచే రెడీ అవుతున్నారు.

దీపావళి పండుగ షాపింగ్ చేస్తున్నారా ? అయితే ఇది గుర్తుంచుకోండి!

దీపావళి పండుగ షాపింగ్ చేస్తున్నారా ? అయితే ఇది గుర్తుంచుకోండి!

వెలుగుల పండుగ దీపావళికి ఇంటిని అలంకరించడానికి డెకరేషన్ వస్తువులను కొనుగోలు చేయడంతోపాటు, ఇంటికి అందం తెచ్చే ఇండోర్ మొక్కలను కూడా కొనుగోలు చేస్తున్నారు. అయితే దీపావళి పండుగ సందర్భంగా ఇంటికి అందాన్నిచ్చే విషయం లో కొనుగోలు చేసే మొక్కలు ఇంట్లోకి ప్రతికూల శక్తిని తీసుకురాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అలాంటప్పుడు దీపావళి పండుగకు ఎలాంటి ఇండోర్ మొక్కలు, ప్రతికూల ప్రభావాన్ని చూపించే డెకరేషన్ వస్తువులు కొనుగోలు చేయకుండా ఉంటే మంచిది అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.

 దీపావళికి కొనుగోలు చేసే మొక్కలలో కాక్టస్ మొక్కలు కొనకండి

దీపావళికి కొనుగోలు చేసే మొక్కలలో కాక్టస్ మొక్కలు కొనకండి

దీపావళి పండుగ సందర్భంగా ఇంట్లో మొక్కలను కొనుగోలు చేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. ఇంట్లో ఎప్పుడూ కాక్టస్ తో పాటు ముళ్ళ ముక్కలను కొనుగోలు చేయకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీపావళి పండుగకు మొక్కలను కొనుగోలు చేసే వారు ఈ విషయాన్ని ప్రధానంగా గుర్తుంచుకోవాలి అని సూచిస్తున్నారు. ఒకవేళ కాక్టస్ మొక్కలను కొనుగోలు చేస్తే అవి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులను కలిగిస్తాయని, కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణలకు కారణమవుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

 దీపావళికి బోన్సాయ్ మొక్కలకు దూరంగా ఉండండి

దీపావళికి బోన్సాయ్ మొక్కలకు దూరంగా ఉండండి


దీపావళి పండుగ సందర్భంగా అందమైన, కాస్ట్లీ బోన్సాయ్ మొక్కలను ఇంటికి తెచ్చుకోకండి. బోన్సాయ్ మొక్కలు ఇంటికి మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఇంటి లోపల అందంగా ఉంటాయన్న భావనతో బోన్సాయ్ మొక్కలను కొనుగోలు చేసి తెచ్చుకుంటే, ఇంట్లో కుటుంబ సభ్యుల పురోగతి ఆగిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ బోన్సాయ్ మొక్కలను ఇంటికి తెచ్చుకోకుండా చూసుకోండి.

దీపావళికి ఇంట్లో పెట్టే పెయింటింగ్స్ విషయంలో జాగ్రత్త

దీపావళికి ఇంట్లో పెట్టే పెయింటింగ్స్ విషయంలో జాగ్రత్త


ఇక దీపావళి పండుగ సందర్భంగా ఇంట్లో డెకరేట్ చేసే వస్తువుల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది. పండుగ సందర్భంగా ఇంటిని అందంగా అలంకరించటంలో భాగంగా తీసుకునే పెయింటింగ్స్ విషయంలో, ఫోటో ఫ్రేమ్ ల విషయంలో జాగ్రత్త వహించాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మహాభారత యుద్ధానికి సంబంధించిన పెయింటింగ్స్ ను పెట్టకూడదని సూచిస్తున్నారు.

 పాజిటివ్ ఎనర్జీని పెంచే డెకరేషన్ వస్తువులనే వాడండి

పాజిటివ్ ఎనర్జీని పెంచే డెకరేషన్ వస్తువులనే వాడండి


అంతేకాదు తీవ్రమైన విషాదాన్ని, నిరాశ నిస్పృహలను, ఒంటరితనాన్ని సూచించే పెయింటింగ్స్ ను ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదని చెబుతున్నారు. పండుగ సందర్భంగా తెచ్చుకునే డెకరేషన్ వస్తువులలో పెయింటింగ్స్ విషయంలో ఉదయిస్తున్న సూర్యుడు, పచ్చని ప్రకృతి తదితర పెయింటింగ్స్ ఇంటికి పండుగ శోభను తెస్తాయి అని, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ని పెంచుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పండుగకు ఇంటిని అందంగా అలంకరించుకుని , అదే సమయంలో వాస్తు శాస్త్ర నియమాలను పాటిస్తే సత్ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+