Vastu tips: ఈ రోజుల్లో ఇంటికి కొత్త చీపురు తీసుకురాకండి; పేదరికం వస్తుంది!!

ఇంట్లో చెత్తను శుభ్రం చేసే చీపురు గురించి వాస్తు శాస్త్రంలో కొన్ని విశేషాలు చెప్పబడ్డాయి. మనం ఇంటి నిర్మాణానికి ఇంట్లో పెట్టుకునే వస్తువులు ఏవిధంగా అయితే వాస్తు నియమాలను పాటిస్తామో అదేవిధంగా ఇంట్లో చీపురు విషయంలో కూడా కొన్ని వాస్తు నియమాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

చీపురును మహాలక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అటువంటి చీపురును ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి తెచ్చుకోకూడదు. ఇక చీపురును ఎక్కడపడితే అక్కడ కూడా ఎలా పడితే అలా పెట్టకూడదు. చీపురును ఈశాన్యం మూల, ఆగ్నేయ మూలలో పొరపాటున కూడా ఉంచకూడదు. నైరుతి, వాయువ్య మూలలో చీపురును కనిపించకుండా పెట్టాలని వాస్తు శాస్త్రం చెబుతోంది.

 Vastu tips

ఇక పాత చీపురు పాడైపోయినప్పుడు చీపురును కొనుగోలు చేయాలనుకునే వారు ఎప్పుడు పడితే అప్పుడు కొత్త చీపురును కొనుగోలు చేయకూడదు. శనివారం నాడు కొత్త చీపురును కొనుగోలు చేసుకొని ఇంటికి తెచ్చుకుంటే మంచిదని చెబుతున్నారు. అలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని చెబుతున్నారు.

పొరపాటున కూడా శుక్లపక్షంలో చీపురును కొనుగోలు చెయ్యకూడదని, కృష్ణ పక్షంలో మాత్రమే చీపురును కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. ఒకవేళ పొరపాటున శుక్లపక్షంలో ఎవరైనా చీపురును కొనుగోలు చేస్తే అది దురదృష్టానికి హేతువు గా మారుతుందని చెబుతున్నారు. అప్పుడు చీపురు కొన్నవారికి ఊహించని కష్టాలు వస్తాయని అంటున్నారు.

 Vastu tips

అంతేకాదు శుక్రవారం నాడు, మంగళవారం నాడు, మహాలయ పక్షం సమయాల్లో అంటే భాద్రపద మాసంలోని పౌర్ణమి నుంచి అమావాస్య రోజుల్లో చీపురును కొనుగోలు చేయడం ఏ విధంగానూ మంచిది కాదని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి పొరపాటున కూడా చీపురుకు సంబంధించిన తప్పులు చెయ్యకూడదు. ఒకవేళ అలా చేస్తే ధనవంతుని కూడా పేదరికం పట్టి పీడిస్తుంది. అందుకే చీపురును కొనుగోలు చేసే విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+