vastu tips: పెళ్ళైన కుమార్తెను అత్తగారింటికి పంపేటప్పుడు ఇవి ఇస్తున్నారా.. అరిష్టం!!

ప్రతి తల్లిదండ్రులు కుమార్తెకు వివాహం చేసే సమయంలో కుమార్తె సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అంతేకాదు కుమార్తెకు పెళ్లి చేసిన తర్వాత ఆమెకు కావలసిన వస్తువులను కూడా ఇచ్చి అత్తవారింటికి సాగనంపుతారు. పెళ్లి చేసిన తర్వాత కుమార్తెను అత్తవారింటికి సాగనంపుతూ వీడ్కోలు పలికే సమయంలో కొన్ని తప్పులను చేస్తే అరిష్టం వస్తుందని, పొరపాటున కూడా కొన్ని వస్తువులను ఆడపిల్లకు ఇచ్చి పంపకూడదని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

నాలుగు వస్తువులు పెళ్ళైన ఆడపిల్లలకు ఇస్తే అరిష్టం

నాలుగు వస్తువులు పెళ్ళైన ఆడపిల్లలకు ఇస్తే అరిష్టం

పెళ్లి చేసిన తర్వాత ఆడపిల్లలకు ఇచ్చి పంపకూడని వస్తువులు ఏమిటి? వాటిని ఒకవేళ ఇస్తే ఏం జరుగుతుంది? వంటి వివరాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం. తల్లిదండ్రులు కుమార్తె జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అత్తవారింటికి వెళ్ళిన ఆడపిల్ల దేనికి లోటు లేకుండా ఉండాలని అనేక బహుమతులను కూడా ఇచ్చి పంపుతారు. అయితే ముఖ్యంగా నాలుగు వస్తువులను ఆడపిల్లకు ఇచ్చి పంపితే అరిష్టమని, దానివల్ల రకరకాల సమస్యలు వస్తాయి అని చెబుతున్నారు వాస్తు శాస్త్రం నిపుణులు.

ఊరగాయ పచ్చడి

ఊరగాయ పచ్చడి

ఆ వస్తువులలో ముఖ్యమైనది ఊరగాయ పచ్చడి. కొత్తగా పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్తున్న ఆడపిల్ల తల్లి ఇంట్లో చేసిన ఊరగాయ పచ్చళ్ళు తీసుకువెళ్లకూడదు. కారంతో తయారు చేసిన ఊరగాయ పచ్చళ్ళు తీసుకువెళ్తే అత్తవారింట్లో బంధాలు కూడా అలాగే కారంగా ఉంటాయని చాలామంది బలంగా నమ్ముతారు. కనుక పొరపాటున కూడా ఊరగాయ పచ్చళ్ళు ఇచ్చి పంపకూడదు. ఒకవేళ ఊరగాయ పచ్చడి కూతురికి ఇవ్వాలి అనుకుంటే పెళ్లి తర్వాత ఆమె ఇంటికి వెళ్లి, మార్కెట్ నుండి పదార్థాలు తెచ్చుకొని అక్కడే సిద్ధం చేసి ఇచ్చి వస్తే మంచిదని చెబుతున్నారు.

చీపురు

చీపురు

అంతే కాదు అత్తవారింటికి వెళ్లే కూతురికి చీపురుని కూడా పొరపాటున కూడా ఇచ్చి పంపకూడదు. లక్ష్మీదేవి స్వయంగా చీపురులో నివసిస్తుందని చెబుతారు. అటువంటి చీపురును ఇచ్చి పంపిస్తే ఆడపిల్ల వారి కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉండదని, వారు అనేక కష్టాలు పడాల్సి వస్తుందని చెబుతున్నారు. కుమార్తెకు చీపురును ఇచ్చి పంపిస్తే వాళ్ల ఇంట్లో పరిస్థితులు దుఃఖదాయకంగా మారుతాయి అని చెబుతున్నారు.

సూది మరియు జల్లెడ

సూది మరియు జల్లెడ

అత్తవారింటికి వెళ్లే కూతురికి ఎప్పుడు సూదిని ఇచ్చి పంపొద్దు అని, సూది జీవితంలో తీపికి బదులు చేదును తెస్తుందని, అది భార్యాభర్తల మధ్య గొడవలకు కూడా కారణం అవుతుందని చెబుతున్నారు. ఇక అత్తవారింటికి వెళ్లే కూతురికి పొరపాటున కూడా జల్లెడ ఇవ్వకూడదని, జల్లెడ ఇచ్చి పంపితే వారి జీవితంలో సంతోషం జల్లెడ పట్టినట్టు అవుతుందని చెబుతున్నారు. కాబట్టి ఈ నాలుగు వస్తువులు ఇచ్చి పంపితే అరిష్టమని, కూతురు సంతోషంగా ఉండాలి అని, తాము కూడా సుఖంగా, సంతోషంగా జీవించాలని భావించే వారు ఎవరూ ఈ వస్తువులు ఇవ్వొద్దని చెబుతున్నారు వాస్తు శాస్త్ర పండితులు.

Disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+