vastu tips: తులసిమొక్క ఆకులు తుంచేటప్పుడు ఈ తప్పులు అస్సలు చెయ్యకండి.. దురదృష్టం వస్తుంది!!
తులసి ఆకుల మాల విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనది కావడంతో చాలామంది తులసి ఆకులతో మాలలల్లి విష్ణువుకు సమర్పిస్తారు. అయితే ఇలా తులసి ఆకులను తెంపేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి.
హిందూమతంలో తులసి మొక్కకు చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. తులసి మొక్కను నిత్యం పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని, విష్ణువుకి ఇష్టమైన మొక్క తులసి మొక్క కావడం వల్ల ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కూడా లభిస్తుందని చాలా ప్రధానంగా విశ్వసిస్తారు. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం కూడా ఇంట్లో తులసి మొక్కను పెట్టుకోవడం ఎంతో శుభ ఫలితాలను ఇస్తుంది. అయితే తులసి మొక్క విషయంలో కొన్ని వాస్తు నియమాలను పాటించాలి. అలాగే తులసి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తులసి మొక్క మీద చేయి వేసి ఎప్పుడు పడితే అప్పుడు, ఆకులు తుంచడం కూడా మంచిది కాదని సూచించబడింది.

ఇంట్లో తులసిని ఈ దిశలోనే పెట్టుకోండి
సాధారణంగా వాస్తు ప్రకారం ఇంట్లో తులసి మొక్కను పెట్టుకోవాలనుకునేవారు తూర్పు దిశలో పెట్టాలి. ఇంకా ఈశాన్యం దిశలో తులసి మొక్కను పెట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పబడింది. ఉత్తరం దిశలో కూడా తులసి మొక్కను పెట్టుకోవచ్చని సూచించబడింది. ఇక ఇదే సమయంలో తులసి మొక్కకు క్రమం తప్పకుండా నీరు కూడా అందించాలని సూచించబడింది. తులసి ఆకుల మాల విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనది కావడంతో చాలామంది తులసి ఆకులతో మాలలల్లి విష్ణువుకు సమర్పిస్తారు. అయితే ఇలా తులసి ఆకులను తెంపేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి.

తులసి ఆకులు తెంపే సమయంలో జాగ్రత్త
నియమాలు పాటించకుండా ఎప్పుడు పడితే అప్పుడు తులసి ఆకులను తెంపి పొరపాటు చేస్తే జీవితంలో అనేక రకాల సమస్యలు వచ్చి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. తులసి ఆకులను తెంపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే, దరిద్రం పట్టుకొని వదలకుండా వేధిస్తుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. మరి తులసి ఆకుల్ని తెంపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను చూస్తే పొరపాటున కూడా స్నానం చేయకుండా తులసి ఆకులను ముట్టుకోకూడదు.

ఈ రోజుల్లో తులసి ఆకులను తెంచకూడదు
శుభ్రంగా స్నానం చేసిన తర్వాత, లక్ష్మీదేవిని ధ్యానం చేసి, నమస్కరించి, తులసి ఆకులను తెంచడానికి తల్లి అనుమతిని కోరి ఆపై ఒక్కొక్క ఆకుగా తులసి ఆకులను తెంచాలని సూచించబడింది. మాంసాహారం భుజించి పొరపాటున కూడా తులసి మొక్క పైన చెయ్యి వేయకూడదు. అంతేకాదు పొరపాటున కూడా ఆదివారం రోజు, ఏకాదశి రోజు, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం రోజులలో తులసి ఆకులను పొరపాటున కూడా తెంచకూడదని సూచించబడింది.

తులసి ఆకులు తెంచే సమయంలో ఈ పని చెయ్యకండి
సూర్యాస్తమయం తర్వాత కూడా తులసి ఆకులను ఎట్టి పరిస్థితులలోనూ తెంచకూడదని చెబుతున్నారు. ఒకవేళ అలా సూర్యాస్తమయం అయిన తర్వాత తులసి ఆకులను తెంచితే అది అశుభమైందిగా పరిగణించబడుతుంది. తులసి ఆకులను తెంచేటప్పుడు చేతితో తెంచాలి కానీ గోళ్ళతో తులసి ఆకులను గిల్లకూడదు. ఒకవేళ అలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. తులసి ఆకులను తెంచేటప్పుడు ఒకేసారి కొమ్మలు, కొమ్మలుగా విరవకూడదు. ఒక్కొక్క ఆకును మాత్రమే తెంచాలి.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications