వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

vastu tips: పొరబాటున కూడా ఈ వస్తువులను బదులుగా కూడా ఇవ్వకండి.. అప్పుల్లో కూరుకుపోతారు!!

పొరబాటున కూడా కొన్ని వస్తువులను బదులుగా కూడా ఇవ్వకూడదు.. ఒకవేళ ఇస్తే అప్పుల్లో కూరుకుపోతారు.

|
Google Oneindia TeluguNews

కొంతమంది ఎవరైనా ఏదైనా వస్తువు అడిగితే లేదు అనకుండా ఇస్తూ ఉంటారు. కొంతమందికి దానం చేసే గుణం ఉంటే, మరి కొంతమంది బదులుగా ఇస్తూ ఉంటారు. దానమైనా, బదులైనా వాస్తు శాస్త్ర నియమాలను అనుసరించి నడుచుకుంటే మంచి జరుగుతుందని చెప్పబడింది. అయితే వాస్తు శాస్త్రంలో కొన్ని వస్తువులను ఇవ్వకూడదని సూచించబడింది. ఇక కొన్ని వస్తువులను ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వకూడదని చెప్పబడింది. మరికొన్ని వస్తువులను సూర్యాస్తమయం సమయంలో ఇస్తే అరిష్టమని చెప్పబడింది. అసలు వాస్తు శాస్త్రంలో ఎవరికి ఇవ్వకూడని వస్తువులు ఏంటి? ఎందుకు ఇవ్వకూడదు? వంటి అనేక వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

vastu tips: వేపచెట్టు ఇంటి ముందు తూర్పున ఉంటే శుభమా? అశుభమా? తెలుసుకోండిvastu tips: వేపచెట్టు ఇంటి ముందు తూర్పున ఉంటే శుభమా? అశుభమా? తెలుసుకోండి

పొరపాటున కూడా దానం చెయ్యకూడని వస్తువులు ఇవే

పొరపాటున కూడా దానం చెయ్యకూడని వస్తువులు ఇవే

వాస్తుశాస్త్రంలో దానం చేయడానికి మంచి లక్షణంగా సూచించారు. దానధర్మాలు చేయడం సత్ఫలితాలను ఇస్తాయని, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాయని చెప్పబడింది. అయితే కొన్ని వస్తువుల విషయంలో మాత్రం దీనికి మినహాయింపు ఉంది. కొన్ని వస్తువులు పొరపాటున దానం చేసినా, బదులుగా ఇచ్చినా ఆర్థికంగా నష్టపోతారని, ఏ మాత్రం కలిసి రాదని చెప్పబడింది. ఇక ఏ ఏ విషయాల్లో మనం బదులు కానీ, దానం కానీ ఇవ్వకుండా జాగ్రత్త పడాలి అంటే..

చేతి గడియారం ఇస్తున్నారా?

చేతి గడియారం ఇస్తున్నారా?


గడియారం .. మన చేతి గడియారాన్ని పొరపాటున కూడా ఎవరికి ఇవ్వకూడదు. చేతి గడియారం యొక్క మంచి, చెడు అదృష్టంతో ముడిపడి ఉంటాయి. మనం క్రమం తప్పకుండా ధరించే వాచ్ ను ఎవరికి పడితే వారికి ఇవ్వకూడదు. ఇలా చేస్తే అది మీ వృత్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఇక తీసుకున్న వారు కూడా ఒక్కోసారి చేతి గడియారం తీసుకోవడం వల్ల కొత్త కొత్త సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

 దువ్వెన దానం చేసినా, బదులు ఇచ్చినా ఏం జరుగుతుందంటే

దువ్వెన దానం చేసినా, బదులు ఇచ్చినా ఏం జరుగుతుందంటే


ఇక ఇతరుల వద్ద నుండి తీసుకోకూడని మరొక వస్తువులో దువ్వెన ముఖ్యమైనది. ఎవరి వద్దనైనా దువ్వెనని తీసుకొని తిరిగి ఇవ్వకుండా ఉండకూడదు. దాన్ని బదులుగా కానీ, దానంగా కానీ తీసుకోకూడదు. ఇది మీ అదృష్టాన్ని ఎంతో ప్రభావితం చేస్తుందని వాస్తు శాస్త్రం నిపుణులు చెప్తున్నారు. మీరు ఈ వస్తువులను ఒకవేళ ఎవరికైనా దానమిస్తే మీరు చేసే పనిలో కొంత భాగాన్ని కూడా వారికి ఇచ్చినట్టే అవుతుందని చెబుతున్నారు. కాబట్టి దువ్వెన విషయంలోనూ ఎవరికి ఇవ్వకుండా, ఎవరి వద్ద తీసుకోకుండా జాగ్రత్త పడండి.

చీపురును ఇస్తున్నారా?

చీపురును ఇస్తున్నారా?


ఇక వాస్తు శాస్త్రంలో చీపురుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. చీపురులో సంపదల దేవత అయిన లక్ష్మీదేవి నివసిస్తుందని చాలామంది విశ్వసిస్తారు. అందుకే పొరపాటున చీపురును ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఎవరి దగ్గర నుంచి చీపురుని తెచ్చుకోకూడదు. ఒకవేళ అలా చేస్తే ఆర్థిక పరిస్థితిని నేరుగా ప్రభావితం చేస్తుందని, అనుకోని ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు.

 పెన్ తీసుకుని ఇవ్వకుండా మర్చిపోతున్నారా?

పెన్ తీసుకుని ఇవ్వకుండా మర్చిపోతున్నారా?


ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఇవ్వకూడని తీసుకోకూడని మరొక వస్తువు పెన్. చాలామంది ఏదైనా అవసరం ఉన్నప్పుడు పక్క వాళ్ళని అడిగి పెన్ తీసుకుంటారు. మళ్లీ ఆ పని పూర్తయిన తర్వాత పెన్ తిరిగి ఇవ్వరు. ఒక్కోసారి ఇవ్వాలనుకున్నప్పటికీ మర్చిపోతారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని చెప్తున్నారు వాస్తు శాస్త్రం నిపుణులు. ఎవరి దగ్గరైనా పెన్ తీసుకుంటే ఆ పెన్ ను తిరిగి ఇవ్వాలని దానిని మన వద్ద ఉంచుకోవడం వల్ల మన ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు.

ఉప్పు బదులు ఇస్తున్నారా?

ఉప్పు బదులు ఇస్తున్నారా?


ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఇతరుల వద్ద నుండి తీసుకోకూడని వస్తువు, ఇవ్వకూడని వస్తువు ఉప్పు. చాలామంది ఇంట్లో వస్తువులు నిండుకుంటే పక్కింటి వారి నుండి అరువు లేదా బదులు తెచ్చుకుంటూ ఉంటారు. అయితే అట్లా బదులు తెచ్చుకునే సమయంలో ఉప్పు తెచ్చుకోవడానికి నివారించాలని చెబుతున్నారు. పొరపాటున కూడా ఉప్పు ఎవరికి బదులు కానీ అప్పు కానీ ఇవ్వకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ ఉప్పు ఇచ్చినా, ఉప్పు తెచ్చుకున్నా ఆర్థిక పరిస్థితిపై నేరుగా ప్రభావం పడుతుందని చెబుతున్నారు. ఇక ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ఈ వస్తువులను ఎవరి దగ్గర నుండి తీసుకోకుండా, ఎవరికి ఇవ్వకుండా జాగ్రత్త పడాలని సూచించబడింది.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
It is said that even by mistake, don't give wrist watch, comb, salt, pen, broom as a donation or in exchange. you will go into debt
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X