vastu tips: రాత్రి పడుకునే ముందు తల దగ్గర వీటిని పెట్టుకోకండి.. ఆర్ధిక నష్టాలు!!

చాలామంది నిద్రపోయేటప్పుడు తల దగ్గర కొన్ని వస్తువులు పెట్టుకొని పడుకుంటూ ఉంటారు. అయితే అది ఏమాత్రం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కొన్ని వస్తువులు పెట్టుకొని పడుకోవడం వల్ల జీవితంలో ప్రతికూల ప్రభావం పెరుగుతుందని, మంచి జరగదని హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట నిద్ర పోయే సమయంలో మంచం కింద కానీ, తలకింద కానీ, తల దగ్గర కానీ ఎలాంటి వస్తువులు పెట్టకూడదని చెబుతున్నారు.

వాస్తు శాస్త్రం ప్రకారం ఏ ఏ వస్తువులు పెడితే సానుకూలత పోయి, ప్రతికూలత పెరుగుతుందో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. తల దగ్గర కొన్ని వస్తువులు పెట్టుకొని పడుకోవడం వల్ల వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితం రెండూ ప్రభావితమవుతాయి. అవి ఆర్థిక విషయాలలో ప్రతికూలతలను కలిగిస్తాయి.

 Vastu tips: Dont keep these things near your head before going to bed at night.. causes Financial losses!!

ముఖ్యంగా తల దగ్గర పర్సులు పెట్టుకుని పడుకునే వారికి ఇబ్బందులు వస్తాయి. ఇలా పెట్టుకుంటే ఖర్చులు అనవసరంగా పెరుగుతాయి. కాబట్టి పర్సులు, డబ్బులు వంటి వాటిని అల్మరాలో పెట్టుకుని ప్రశాంతంగా పడుకోవాలి. కాబట్టి తల దగ్గర పొరపాటున కూడా డబ్బులు, పర్సులు వంటివాటిని పెట్టుకోకూడదు.

చాలామంది తలదగ్గర దిండు కింద మెడలోని గొలుసులు, తాళ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇలా చేసేవారికి జీవితంలో కష్టాలు వస్తాయని, ఏ పని చేసినా ప్రతిబంధకాలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. చాలామందికి రాత్రి సమయాల్లో పుస్తకాలు చదివే అలవాటు ఉంటుంది. అయితే రాత్రివేళల్లో చదివిన పుస్తకాలను, మ్యాగజైన్లను పొరపాటున కూడా తలకింద పెట్టుకోకూడదు. అలా పెట్టుకోవడం వల్ల జీవితంలో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

చాలామంది పడుకునే ముందు బెడ్ పక్కనే వాటర్ బాటిల్స్ ను పెట్టుకొని పడుకుంటూ ఉంటారు. అయితే అది మంచిది కాదని చెబుతున్నారు. అది మన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని హెచ్చరిస్తున్నారు. చాలా మంది పడుకునే ముందు వాచ్ లు, ల్యాప్ టాప్ లు, ఫోన్లు వంటి వాటిని తల దగ్గర పెట్టుకుని పడుకుంటారు. అది ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి పొరపాటున కూడా ప్రతికూలతలు కలిగించే ఈ వస్తువులు పడుకునేటప్పుడు తల దగ్గర పెట్టుకోకండి.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+