Vastu tips: అప్పులు, బాధల్లో మునిగిపోయారా? గంగాజలంతో అద్భుతమైన నివారణలు మీ కోసమే!!
చాలామంది పీకల్లోతు అప్పుల్లో మునిగి పోయామని తెగ బాధపడుతూ ఉంటారు. అయితే అలాంటి వారు గంగాజలంతో ఈ అద్భుతమైన నివారణలు ట్రై చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు జ్యోతిష్య, వాస్తు శాస్త్ర నిపుణులు. భారతదేశంలోని హిందువులు గంగాజలాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు.
ప్రతి పూజలోనూ చాలామంది గంగాజలాన్ని ఉపయోగిస్తారు. గంగాజలం పవిత్రమైనది మాత్రమే కాకుండా అనేక అద్భుతమైన గుణాలతో కూడి ఉంది. అందుకే గంగాజలంతో జీవితంలో ఉన్న అనేక సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు. అప్పుల బాధ నుండి బయటపడడం కోసం, దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి బయటపడడం కోసం, సమస్యలను పరిష్కరించుకోవడం కోసం గంగాజలం ఏవిధంగా ఉపయోగపడుతుందో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

ఒక ఇత్తడి పాత్రలో గంగాజలాన్ని నింపి గదిలో ఈశాన్యం మూలలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల అప్పుల భారం క్రమంగా తగ్గుతుంది. ఇక దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడేవారు లేదా పదే వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వారు గంగాజలంతో ఆ సమస్యల నుంచి బయటపడతారు. ప్రతి ఆదివారం సూర్యుడికి గంగాజలాన్ని నివేదించడం, సోమవారాలలో గంగాజలంతో పరమశివునికి అభిషేకం చేయడం చేయాలి.
శివుడికి అభిషేకం చేసేవారు ఇత్తడి పాత్రలో గంగాజలాన్ని నింపి అందులో ఐదు బిల్వపత్రాలను ఉంచి శివలింగానికి సమర్పించాలి. ఈ పరిహారాన్ని 40 రోజుల పాటు పాటిస్తే సరైన ఫలితాలు లభించి ఆరోగ్యం మెరుగు పడుతుంది. పిల్లలకు అనారోగ్య సమస్యలు ఉన్న గంగాజలాన్ని తీసుకుని వారిపై చల్లితే వారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.గంగాజలం రోజు తాగే వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటారని ఇది ఎంతో మంచి చేస్తుందని చెబుతున్నారు.
ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే గంగా జలాన్ని చల్లితే దోషాలు తొలగిపోతాయి. గంగా జలాన్ని ఇంట్లో చల్లడం వల్ల ఇంట్లో ఉండే ప్రతికూలతలు తొలగిపోతాయి. ఇక వివాహానికి ఆటంకం కలిగితే ప్రతి రోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం చిటికెడు పసుపు కలుపుకొని ఆ నీటిని ప్రతి రోజు స్నానం చేయాలి. ఇలా ఇరవై 21 రోజులపాటు చేసిన తర్వాత వివాహం జరిగే అవకాశం ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications