వాస్తు ప్రకారం జీతం రాగానే అప్పులు తీరుస్తున్నారా? అయితే ఇలా చేయండి..!
చాలామందికి జీతం రాగానే ఒకటే టెన్షన్.. ఎప్పుడు అప్పులు తీర్చేద్దామా అని! ఆత్రుతలో జీతం పడగానే సగం కంటే ఎక్కువ మొత్తాన్ని అప్పులకే కేటాయిస్తుంటారు. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం జీతం పడిన వెంటనే అప్పు తీర్చడం వల్ల కొన్ని ప్రతికూలతలు ఉన్నాయని మీకు తెలుసా? దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తగ్గకపోగా, మరింత పెరుగుతాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
లక్ష్మీ దేవికి అవమానం?
హిందూ ధర్మం ప్రకారం సంపాదనను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం. జీతం రాగానే ఆ డబ్బును శుభ కార్యాలకో, ఇంట్లో అవసరాలకో వాడకుండా నేరుగా అప్పుల వాడి చేతిలో పెట్టడం అంటే.. వచ్చిన లక్ష్మిని గౌరవించకుండా బయటకు పంపడమే అని అర్థం. దీనివల్ల ఇంట్లో ధన ప్రవాహం తగ్గిపోతుంది.

'శూన్య' హస్తం వద్దు
జీతం పడిన మొదటి రోజే మీ అకౌంట్ లేదా జేబు ఖాళీ కాకూడదు. అప్పు తీర్చడం వల్ల మీ దగ్గర డబ్బు శూన్యం అయితే, ఆ నెలంతా మీకు ఆర్థికంగా 'శూన్య కాలం' నడుస్తుందని శాస్త్రం చెబుతోంది. ఇది మనశ్శాంతిని దెబ్బతీస్తుంది.
ఈ చిట్కాలు పాటించండి
ఉప్పు లక్ష్మీదేవి సోదరిగా భావిస్తారు.
ఇది ఇంట్లో నెగటివ్ ఎనర్జీని తీసేసి ధనాన్ని ఆకర్షిస్తుంది.
జీతం డబ్బులతో ఇంట్లోకి మొదటిగా కళ్లుప్పు కొనడం మహా పవిత్రం.
అప్పులు తీర్చడానికి మంగళవారం అత్యంత అనుకూలమైన రోజు.
జీతం పడిన వెంటనే కాకుండా, కనీసం ఒక రోజు తర్వాత అప్పు చెల్లించడం మంచిది.
అప్పు తీసుకునేటప్పుడు నైరుతి దిశలో కూర్చుని తీసుకోవద్దు.
అప్పు తీర్చేటప్పుడు ఉత్తర లేదా తూర్పు దిశ వైపు తిరిగి డబ్బులు ఇవ్వడం వల్ల మళ్ళీ అప్పులు చేయాల్సిన అవసరం రాదు.
జీతం డబ్బును ఇంటికి తెచ్చాక మొదట ఇంట్లోని పూజా గదిలో లేదా బీరువాలో కొద్దిసేపు ఉంచండి.
ఆ డబ్బుకు పసుపు, కుంకుమ అద్ది నమస్కరించుకోవడం వల్ల 'ధన వృద్ధి' కలుగుతుంది.
అప్పు తీర్చడం ధర్మమే, కానీ అది మీ ఆర్థిక మూలాలను దెబ్బతీయకూడదు.
జీతం రాగానే అందులోంచి కొంత మొత్తాన్ని (అది 10 రూపాయలైనా సరే) దేవుడి హుండీకో లేదా ధర్మ కార్యానికో తీసి పక్కన పెట్టండి. దీనివల్ల ధనానికి శుభత్వం చేకూరుతుంది.
జీతం రాగానే లక్ష్మీ దేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించి, ఆ తర్వాతే బాధ్యతలను నెరవేర్చండి. దీనివల్ల మీ సంపాదన అభివృద్ధి చెందుతుంది.












Click it and Unblock the Notifications