vastu tips: నిమ్మకాయలతో ఈ పనులు చేస్తే అదృష్టం.. ఐశ్వర్యం కూడా!!
మన జీవితంలోని దోషాలను తొలగించి నిమ్మకాయ మనకు అదృష్టాన్ని తీసుకువస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
వాస్తు శాస్త్రంలో అనేక వాస్తు దోష నివారణలు చెప్పబడ్డాయి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ని దూరం చేసుకోవడానికి, పాజిటివ్ ఎనర్జీ తో సంతోషంగా జీవించడానికి వాస్తు శాస్త్రంలో అనేక చిట్కాలు చెప్పబడ్డాయి. నరదృష్టితో ఇబ్బంది పడే వారికి సైతం కొన్ని సూచనలు చేయబడ్డాయి. ముఖ్యంగా అటువంటి వాటిల్లో బాగా ఉపయోగపడేది నిమ్మకాయ. నిమ్మకాయ నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది.

నిమ్మకాయలతో ధనలాభం
మన జీవితంలోని దోషాలను తొలగించి నిమ్మకాయ మనకు అదృష్టాన్ని తీసుకువస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నిమ్మకాయలను సరైన విధానంలో వాడటం వల్ల అది మనకు అదృష్టాన్ని తెచ్చి ధనవంతులుగా మార్చడానికి ఉపయోగపడుతుంది. నిమ్మకాయలు చెడు దృష్టిని, దుష్టశక్తులను, ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని సమర్థవంతంగా తొలగిస్తాయి. అందుకే చాలామంది ఇళ్ళ ముందు, వాహనాలకు, తాము వ్యాపారాలు నిర్వహించే దుకాణాలకు నిమ్మకాయలు కట్టుకుంటారు.

వ్యాపార అభివృద్ధి కోసం నిమ్మకాయలతో ఇలా చెయ్యండి
వ్యాపార అభివృద్ధి కోసం నిమ్మకాయలు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రతికూల పరిస్థితులను నివారిస్తాయి. మంచి సనుకూలమైన దృక్పధాన్ని వ్యాపారంలో తీసుకువస్తాయి. అందుకు ప్రతి శనివారం నాడు మీ ఆఫీసు లేదా షాప్ లో నాలుగు గోడలకు నిమ్మకాయను తాకించి దానిని నాలుగు ముక్కలుగా చేసి బయట పారేస్తే ప్రతికూల శక్తి తొలగిపోతుందని చెబుతున్నారు.వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుందని సూచిస్తున్నారు.

అదృష్టం కలిసి రావాలంటే నిమ్మకాయలతో ఈ పని చేసి చూడండి
అంతేకాదు అదృష్టం అన్నింటిలోనూ కలిసి రావాలి అంటే, నిమ్మకాయను తీసుకొని ఏడుసార్లు తల పైనుండి చుట్టూ తిప్పి దానిని రెండు ముక్కలుగా కట్ చేసి కుడి చేతిలో భాగాన్ని ఎడమవైపుకు, ఎడమ చేతిలోని నిమ్మచెక్కను కుడివైపున వెనక్కు అలానే పారేయాలని, ఇది మీకు అదృష్టాన్ని తీసుకువస్తుందని సూచిస్తున్నారు. ఇక నిమ్మకాయను పారేసిన తర్వాత మళ్లీ దానిని చూడకూడదని కచ్చితంగా అందరూ గుర్తుంచుకోవాలి.

నరదృష్టికి, పనిలో విజయానికి నిమ్మకాయలతో ఫలితం
ఇక నరదృష్టి పోవాలి అంటే నిమ్మకాయను నాలుగు భాగాలుగా చేసి తల నుండి పాదం వరకు ఏడుసార్లు నిమ్మకాయలను క్రిందికి మన ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోయేలా టిప్పి దానిని బయటపడేస్తే చెడు దృష్టి మీపై పడకుండా ఉంటుందని చెబుతున్నారు. ఇక ఏదైనా పనిలో విజయం సాధించాలని ఎంత ప్రయత్నం చేస్తున్నా, విజయం సాధించలేకపోతే నిమ్మకాయలో నాలుగు లవంగాలను గుచ్చి, ఆ తర్వాత ఏదైనా హనుమాన్ ఆలయానికి వెళ్లి హనుమాన్ చాలీసా చదవాలని అప్పుడు అనుకున్న విజయాలు ప్రాప్తిస్తాయని చెబుతున్నారు.
Disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications