vastu tips: ఇంట్లో బంగారునగలు ఈ దిశలో ఉంచితే డబ్బు రెండింతలు అవుతుంది!!
ఇంటిని ఏ విధంగా అయితే వాస్తు ప్రకారం నిర్మించుకుంటామో.. అదేవిధంగా ఇంట్లో పెట్టుకునే వస్తువుల విషయంలో కూడా వాస్తు నియమాలు పాటించాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఏ దిశలో పడితే ఆ దిశలో విలువైన వస్తువులు పెట్టకూడదని సూచిస్తున్నారు. సరైన స్థలంలో సరైన వస్తువులు పెట్టకపోతే దాని తాలూకు ప్రతికూల ఫలితాలు మనం అనుభవించాల్సి వస్తుందని చెబుతున్నారు.
ఇంట్లో విలువైన వస్తువులు మరియు ఆభరణాలను సరైన దిశలో ఉంచటం వల్ల సంపద, సంతోషం, శ్రేయస్సు కూడా ఆ కుటుంబానికి పెరుగుతుందని సూచిస్తున్నారు. బంగారాన్ని సరైన చోట పెట్టకుంటే వారు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కచ్చితంగా మీరు ఇంట్లో సంపద, సంతోషం ఉండాలి అని కోరుకుంటే బంగారు ఆభరణాలను పెట్టె విషయంలో వాస్తు నియమాలను తప్పనిసరిగా పాటించాలి.

వాస్తు ప్రకారం విలువైన ఆభరణాలను ఇంటికి కుడివైపున ఉంచాలి. ఇక లాకర్లు, అల్మరాలు వంటి బరువైన వస్తువులను ఇంటికి నైరుతి దిశలో ఉంచడం మంచిది. ముఖ్యంగా నగలను భద్రపరిచేటప్పుడు మీ లాకర్ లేదా అల్మరాలు దక్షిణ దిశలో ఉంచుకునేలా చూసుకోవాలి. దక్షిణ దిశలో, నైరుతిలో దిశలో పెట్టినప్పుడు బంగారు ఆభరణాలు మీకు సానుకూల ఫలితాలను ఇస్తాయి. ఉత్తర దిక్కును కుబేరుని దిక్కుగా పరిగణిస్తారు.
ఈ దిశలో బంగారాన్ని పెట్టినప్పటికీ సంపద రెట్టింపు అవుతుందని చెబుతున్నారు.బంగారు ఆభరణాలను సరైన స్థలంలో పెట్టకపోతే దరిద్ర దేవత తిష్ట వేస్తుంది అని, నెగటివ్ ఎనర్జీ ఉంటుందని చెప్తున్నారు. బంగారాన్ని భద్రపరిచే విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే కుటుంబ సభ్యులు అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు.
వాస్తు శాస్త్రంలో బంగారం చాలా పవిత్రమైన లోహం కావడంతో దీనిని భద్రపరచడం విషయంలో ఖచ్చితంగా వాస్తు నియమాలను పాటించడంతో పాటు, బంగారాన్ని ఎప్పుడు శుభ్రంగా పాలిష్ చేసుకొని పెట్టుకోవాలి. బంగారు అభరణాలను ధరించినా, ఇంట్లో ఉంచుకున్నా కుటుంబ శ్రేయస్సు కొనసాగుతుందని నమ్ముతారు. కాబట్టి సరైన స్థలంలో బంగారు ఆభరణాలను ఉంచి వాస్తు నియమాలు పాటిస్తే మీ డబ్బు రెట్టింపు అవుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
శ్రీరామనవమి నాడు రెండు విశేషయోగాలు.. వీరికి ఊహించని ధనలాభం! -
today rashiphalalu:మీనరాశిలో ఆ గ్రహాల కూటమి.. మీకే సంపదల వెల్లువ! -
కుంభరాశి, మీన రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
today rashiphalalu: నేడు వీరింటికి నడిచొచ్చేను లక్ష్మీదేవి.. తలుపులు తెరవండి! -
వాస్తు ప్రకారం శనివారం రోజు ఈ పనులు చేయండి.. కలిసివస్తుంది -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !!












Click it and Unblock the Notifications