vastu tips: ఉగాదికి ఈ ఆరు వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం మీ వెంటే!!
ఉగాదికి ఈ ఆరు వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం మీ వెంటేనని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు.
హిందువులు అత్యంత ఘనంగా ఉగాది పండుగను జరుపుకుంటారు. చైత్ర శుక్లపక్ష పాడ్యమినాడు అంటే నేడు అత్యంత ఘనంగా ఉగాదిని జరుపుకోవడానికి హిందువులంతా సిద్ధమయ్యారు. బ్రహ్మదేవుడు చైత్రమాసంలోని శుక్లపక్షం పాడ్యమి నాడు ఈ విశ్వాన్ని సృష్టించాడని, ఇక ఇదే రోజు శ్రీరామ పట్టాభిషేకం జరిగిందని రకరకాల ప్రచారాలు ఉన్నాయి. ఉగాది పండుగ తోనే నూతన తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుందని, ఇక నేటి నుండి ఏ పనులు చేసిన అన్ని శుభాలే జరుగుతాయని తెలుగువారు బలంగా విశ్వసిస్తారు.

ఉగాది నాడు కొబ్బరికాయతో ఈ పని చెయ్యండి
ఉగాది ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రకాశవంతంగా మారుస్తుందని నమ్ముతారు. అయితే ఉగాది పండుగ నాడు కొన్ని వస్తువుల్ని ఇంటికి తెచ్చి పెట్టుకుంటే వారి అదృష్టం మెరుస్తుందని, అన్నింటా విజయాలు చేకూరుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఉగాది పండుగ రోజున ఇంటికి ఒక చిన్న కొబ్బరికాయను తెచ్చుకొని దానిని ఎర్రటి గుడ్డలో చుట్టి బీరువాలో జాగ్రత్తగా పెట్టుకుంటే సంపద స్థిరంగా ఉంటుందని, ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని, ఇంట్లో సంతోషము, శాంతి వెల్లివిరుస్తాయని చెబుతున్నారు.

ఉగాదికి ఈ వస్తువు ఇంటికి తెచ్చుకోండి
ఇక అంతే కాదు ఉగాది పర్వదినం నాడు మెటల్ తో తయారు చేసిన తాబేలుని ఇంటికి తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుందని, ముఖ్యంగా బ్రాస్ తాబేలును తెచ్చుకుంటే ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి అని చెబుతున్నారు. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ దూరమై సుఖ శాంతులు, సంతోషం ఇంట్లో వెల్లి విరుస్తాయని చెబుతున్నారు.

ఉగాది నాడు ఇంట్లో ఈ విగ్రహం పడితే సుఖ సంతోషాలు
ఉగాది పండుగ రోజు ఎవరైనా ఇంటికి లాఫింగ్ విగ్రహాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు. లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని తెచ్చి వాస్తు శాస్త్రం ప్రకారం సరైన స్థానంలో పెడితే లబ్ది జరుగుతుందని చెబుతున్నారు. ఇంటికి లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని తీసుకురావడం వల్ల ఇంట్లో సంతోషం ఉంటుందని, ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉంటుందని చెబుతున్నారు.

ఉగాది నాడు ఇంట్లో ఈ మొక్క పెట్టండి
ఉగాది పండుగ రోజు తులసి మొక్క తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే మంచిదని చెబుతున్నారు. హిందూమతంలో తులసి మొక్కను చాలా పవిత్రంగా పూజిస్తారు. విష్ణువుకు ఇష్టమైన తులసిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఇక అటువంటి తులసి మొక్కను ఇంట్లో పెడితే ఇల్లంతా సానుకూలత వ్యాపిస్తుందని, ఇంట్లో వారంతా సుఖసంతోషాలతో ఉంటారని చెబుతారు. కాబట్టి ఉగాది రోజు తులసి మొక్కను తెచ్చి పెట్టుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

వీటిని పెట్టుకుంటే ఇంటికి ధన ప్రవాహం
ఇక ఉగాది నాడు ఇంటికి దక్షిణావర్తి శంఖాన్ని తెచ్చుకుంటే మంచిదని, ఇంట్లో ధన ప్రవాహం కోసం శంఖాన్ని తెచ్చుకొని పూజించి డబ్బు దాచిపెట్టే చోట శంఖాన్ని పెట్టాలని చెబుతున్నారు. ఇది మిమ్మల్ని ఐశ్వర్యవంతులను చేస్తుందని సూచిస్తున్నారు. ఇక ఉగాది పండుగ నాడు మూడు నెమలీకలను తెచ్చి ఇంట్లో పెడితే కూడా మంచి జరుగుతుందని, శ్రీకృష్ణుడికి నెమలీకలు అంటే ఇష్టమని, ఇక నెమళ్లు అంటే లక్ష్మీదేవికి మరీ ఇష్టం కాబట్టి నెమలీకలు పెట్టిన ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications