vastu tips: సడన్ గా నల్లపిల్లి కనిపిస్తే అశుభమా? శుభమా? తెలుసుకోండి

హిందూమతంలో జంతువులకు సంబంధించి అనేక విశ్వాసాలు ఉంటాయి. గోవులను పూజించాలని, పిల్లి ఎదురొస్తే మంచిది కాదని ఇలా ఎన్నో నమ్మకాలు హిందువులు విశ్వసిస్తారు. అనేక జంతువులు హిందూమతంలో పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. ఇక పిల్లి వంటి కొన్ని జంతువులు అశుభ సూచికలుగా భావిస్తారు. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం పిల్లలకు సంబంధించిన కొన్ని విషయాలు నష్టదాయకమైనవని, కొన్ని విషయాలే అశుభాలకు కారణమని అంటున్నారు.

పిల్లి దరిద్ర దేవతకు చిహ్నం, పిల్లులు దరిద్రాన్ని మోసుకువస్తాయని చాలా మంది భావిస్తారు. ప్రతికూల శక్తికి మూలంగా పిల్లుల్ని భావించేవారు, పిల్లిని చూస్తేనే ఏదో కీడు జరుగుతుందని నమ్మేవారు ముఖ్యంగా నల్ల పిల్లుల విషయంలో కొన్ని విషయాలను తెలుసుకోవాలని సూచిస్తున్నారు. అయితే అన్ని సందర్భాలలో మాత్రం కాదు. నల్ల పిల్లి రోడ్డు దాటితే అశుభమని, మనం బయటకు వెళుతున్నప్పుడు పిల్లి ఎదురొస్తే వెళ్లిన పనులు కావని, ఏదో చెడు జరగబోతుందని విశ్వసిస్తారు.

Vastu tips: Is it inauspicious or auspicious if a black cat suddenly appears? Find out

అయితే పిల్లి ఎక్కడైనా మూత్ర విసర్జన చేస్తే కూడా అది అశుభ సంకేతంగానే భావిస్తారు. కలలో కూడా పిల్లి కనిపిస్తే అది చెడు సంకేతం అని, భవిష్యత్తులో పెద్ద నష్టాన్ని చూడబోతున్నారని చెబుతున్నారు. నల్ల పిల్లి ఒక వ్యక్తి ఇంటికి పదేపదే వస్తుంటే అది సదరు వ్యక్తికి దురదృష్ట సూచన అని చాలామంది నమ్ముతారు. అయితే నల్ల పిల్లి విషయంలో అందుకు భిన్నంగా కలలో కనిపిస్తే మంచి జరుగుతుందని చెబుతున్నారు. . కలలోకి నల్ల పిల్లి వస్తే ఆర్థికంగా లాభం జరిగే అవకాశం ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం నిద్ర లేచిన వెంటనే మీకు నల్ల పిల్లి కనిపిస్తే త్వరలో మీ ఇంటికి అతిధి రాబోతున్నారని చెబుతున్నారు.

Vastu tips: Is it inauspicious or auspicious if a black cat suddenly appears? Find out

మీరు మీ పాత స్నేహితులను కలుసుకుంటారు అని చెప్పడానికి ఇది సంకేతమని చెబుతున్నారు. ఇక అంతే కాదు నల్ల పిల్లి ఒక వ్యక్తి ఇంట్లోకి వెళ్లి దానంతట తానే తిరిగి వెళ్ళిపోతే అది ఆ వ్యక్తి అదృష్టానికి చిహ్నంగా పరిగణించబడుతుందని చెబుతున్నారు. నల్ల పిల్లితో అన్ని అశుభాలే కాదు శుభాలు కూడా ఉంటాయని సూచిస్తున్నారు. ఇక ఫలితంగా ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందని చెబుతున్నారు.

Disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+