Vastu tips: ఇంట్లో ఈ ఒక్కటి ఉంటే ఆర్ధికసమస్యలు, ప్రతికూలతలు మాయం!!

భారతీయ ఆచారాలలో కర్పూరానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. కర్పూరాన్ని మన ఇంట్లో పూజ నిమిత్తం ఉపయోగిస్తాం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉంచుకోవడం వల్ల కర్పూరంతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇంట్లో కర్పూరాన్ని ఉపయోగించడం వల్ల ఆర్థిక సమస్యలే కాదు ఆరోగ్య సమస్యలు కూడా పరారవుతాయి.

ప్రతికూల శక్తులను తొలగించే శక్తి కర్పూరానికి ఉంది
హిందూమతంలో దేవుని ఆరాధించటానికి చాలామంది కర్పూరంతో భగవంతుడికి హారతి ఇస్తారు. భగవంతునికి కర్పూరంతో హారతి ఇవ్వడం వల్ల భగవంతుడు ప్రసన్నుడు అవుతాడని చాలామంది దృఢంగా విశ్వసిస్తారు. ఈ క్రమంలోనే కర్పూర హారతి ఇచ్చి పూజలు చేస్తారు. అయితే కర్పూరానికి ఇంటిలో ఉన్న ప్రతికూల శక్తులను కచ్చితంగా తొలగించే శక్తి కూడా ఉంది.

Vastu tips keep camphor in the house financial and health problems will go away

కర్పూరంతో నెగిటివ్ ఎనర్జీ దూరం
ప్రతి ఇంట్లో కర్పూరం ఒకటి ఉంటే చాలు ఆ ఇంట్లో అనేక సమస్యలు ఫటాఫట్ తొలగిపోతాయి. కర్పూరం పొగ మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కర్పూరంలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. కర్పూరాన్ని మన దగ్గర ఉంచుకోవడం వల్ల మన దగ్గరికి వచ్చే నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది. కర్పూరాన్ని పర్సులో గాని, జేబులో గాని పెట్టుకున్నట్లయితే మనసు ప్రశాంతంగా మారుతుంది.

శుక్రుడు బలహీనంగా ఉన్నా, ఆర్ధిక ఇబ్బందులున్నా దీంతో మాయం
కర్పూరాన్ని ఒక తెల్లని గుడ్డలో కట్టి మీ దగ్గర ఉంచుకోవడం వల్ల జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే ఆ బలహీనత పోయి శుక్రుడు బలోపేతం అవుతాడు. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ డబ్బుకు కష్టాలు అనుభవిస్తున్న వారు కర్పూరాన్ని దగ్గర పెట్టుకోవడం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. అంతేకాదు జాతకంలో రాహుకేతు దోషాలు ఉన్నా, సర్ప దోషం ఉన్నా కర్పూరంతో ఆ దోషాలు తొలగిపోతాయి.

కర్పూరానికి ఆరోగ్యాన్ని కాపాడే శక్తి
పూజగదికే కర్పూరాన్ని పరిమితం చేయకుండా మనం కర్పూరాన్ని మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ ని తొలగించడానికి, ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడానికి, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడటానికి ఉపయోగిస్తే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. అందుకే ఇంట్లో ఈ ఒక్కటి ఉంటే చాలు సమస్యలన్నీ పరార్ అని చెబుతారు వాస్తు శాస్త్ర నిపుణులు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+