Vastu tips: ఇంట్లో ఈ చిత్రాన్ని పెట్టి చూడండి.. ఐశ్వర్యం వస్తుందని నమ్మండి!!

వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో పెట్టుకునే ప్రతి వస్తువు ఇంట్లో మనుషుల జీవితం పై ప్రభావం చూపిస్తుంది. అందుకే ఇంట్లో పెట్టే ప్రతి వస్తువును సరైన దిశలో పెట్టుకోవాలి. ముఖ్యంగా కొన్ని ఇంట్లో ఉన్న ప్రతికూల ప్రభావాలను తొలగించి, సానుకూల ఫలితాలను ఇస్తాయి. ఇంట్లో పెట్టుకునే వస్తువులు మాత్రమే కాదు దేవుళ్ళ ఫోటోల విషయంలో కూడా కొన్ని వాస్తు నియమాలు సూచించబడ్డాయి.

అంతేకాదు కొన్ని ఫోటోలను పెట్టుకుంటే అదృష్టం కలిసొస్తుంది. ఇంటికి సంపద వచ్చి పడుతుంది. ఇక అటువంటి ఫోటోలను గురించి ప్రస్తుతం తెలుసుకుందాం. లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంటికి ఐశ్వర్యం కలుగుతుందని చెబుతారు. అందుకు ఇంట్లో లక్ష్మీదేవి ఫోటోను తప్పనిసరిగా ఉంచుకోవాలని సూచిస్తారు. అయితే ఇంట్లో పెట్టుకునే లక్ష్మీదేవి ఫోటో విషయంలో కూడా కొన్ని నియమాలను చెబుతారు.

Vastu tips: Keep this lakshmi image at home.. Believe that wealth will come!!

ఏనుగుతో ఉన్న లక్ష్మీ దేవి చిత్రాన్ని చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ చిత్రంలో ఏనుగు తన తొండం లోకి కలశాన్ని తీసుకున్నట్లు గా ఉంటే శుభఫలితాలనిస్తుందని చెబుతారు. ఏనుగులతో ఉన్న గజలక్ష్మి అమ్మవారి చిత్రాన్ని ఇంట్లో సరైన దిశలో పెట్టుకొని పూజించటం వల్ల ఆ ఇంటికి శ్రేయస్సు, ఆనందం, శాంతి, ఐశ్వర్యం కలుగుతాయి అని చెబుతారు.

ఇక గజలక్ష్మి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ఇంటికి ఈశాన్య మూలలో దేవుని గదిలో కుడివైపున ఉంచాలని చెబుతున్నారు. ఈ దిశలో గజలక్ష్మి చిత్రపటాన్ని ఉంచడం వల్ల కుటుంబ సభ్యులపై లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు ఉంటాయి. వారి ఆర్థిక పరిస్థితిలో పురోగతి ఉంటుంది. గజలక్ష్మి చిత్రాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

గజలక్ష్మీ చిత్రం అదృష్టానికి, విజయానికి చిహ్నంగా చెబుతారు. లక్ష్మీదేవి చిత్రాన్ని ఇంట్లో ఉంచటం వల్ల ఇతర దేవతల ఆశీస్సులు కూడా కలుగుతాయి. గజలక్ష్మి చిత్రం, లేదా విగ్రహం ఇంట్లో వచ్చే అడ్డంకులను తొలగించి ముందుకు సాగడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది.అందుకే లక్ష్మీదేవి ఏనుగులతో ఉన్న చిత్రాన్ని ఇంట్లో పెట్టుకుని పూజిస్తే ఐశ్వర్యవంతులు కావటం తధ్యం.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+