Vastu tips: ఇంట్లో ఈ ఒక్కటి ఉంటే ఎలాంటి వాస్తు దోషమైనా మటుమాయం!!

ఇంటికి ఏ విధంగా అయితే వాస్తు అవసరమో, ఇంట్లో ఉన్న వాళ్ళు సుఖంగా జీవించడానికి కూడా వాస్తు అంతే అవసరం. ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నట్లయితే ఆ కుటుంబం పై తీవ్రమైన ప్రభావం పడుతుంది. వాస్తు దోషం వల్ల వచ్చే ప్రతికూల శక్తులు వ్యక్తుల జీవితాల పైన ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయి.

వాస్తు శా స్త్రం ప్రకారం ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను దూరం చేసి, ఇంట్లో ఉన్న దోషాలను తొలగించడంలో ముఖ్యమైనది, అత్యంత సమర్థవంతమైనది కర్పూరం .ఇంట్లో వాస్తు దోషం ఉంటే కర్పూరంతో కొన్ని నివారణలు పాటిస్తే ఆ వాస్తు దోషం నుంచి కచ్చితంగా బయటపడతారు. ఇంట్లో కర్పూరం ఒక్కటి ఉంటే చాలు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కర్పూరంతో చేసే కొన్ని వాస్తు దోష నివారణలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Vastu tips: keep this precious thing in home to remove vastu dosha!!

అన్ని గదుల మూలల్లో కర్పూరాన్ని ఉంచాలి. గదుల మూలలో పెట్టిన కర్పూరం అయిపోతే ఆ స్థానంలో మరొక కర్పూరాన్ని ఉంచాలి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఇంట్లో కర్పూరాన్ని వెలిగించి, దేశీ నెయ్యితో ఇల్లంతా ధూపం వేయాలి. రాత్రివేళ వంటగదిలో పని అయిపోయిన తర్వాత ఒక శుభ్రమైన డబ్బాలో కర్పూరాన్నిమరియు లవంగాలను కలిపి కాల్చడం మంచిది.

అంతే కాదు స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కలు కర్పూరపు నూనె కలిపి స్నానం చేస్తే అది శరీరాన్ని ఉత్తేజ వంతంగా ఉంచుతుంది. లవంగాలను, కర్పూరాన్ని కలిపి కాల్చి ఇల్లంతా ధూపం వేస్తే ఇంట్లో ఉండే వాస్తు దోషాలు, చిరాకులు తొలగిపోతాయి. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఇంటి మూలలలో కర్పూరాన్ని కాల్చడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వ్యాపిస్తుంది.

ముఖ్యంగా ప్రతిరోజు సాయంత్రం ఆగ్నేయ దిశలో కర్పూరాన్ని వెలిగించడం సిరిసంపదలను ఇస్తుంది. అందుకే వాస్తు శాస్త్రంలో వాస్తు దోష నివారణకు ఒక్క కర్పూరం చాలు అని చెబుతున్నారు. కర్పూరంతో ప్రతికూలతల నుండి బయటపడవచ్చని, సానుకూల శక్తులు ఇంట్లో ఉండేలా కర్పూరం చేస్తుందని వాస్తు నిపుణులు అంటున్నారు.

Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+