vastu tips: తాళంచెవులను ఎక్కడపడితే అక్కడ పెడుతున్నారా? అయితే తీవ్ర ఇబ్బందులే!!

మన ఇంట్లో ఏ వస్తువులు పెట్టడానికైనా ఒక నిర్దిష్టమైన స్థానం ఉంటుంది. అయితే కొన్ని వస్తువులు వాస్తు ప్రకారం కొన్ని నిర్దిష్టమైన స్థానంలోనే పెట్టాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. ప్రతి ఒక్కరికి ఇల్లు, ఆఫీసు, కారు, ఆల్మరాలకు సంబంధించి తాళం చెవులు ఉంటాయి. ఈ తాళంచెవులను పెట్టడానికి కూడా నిర్దిష్టమైన స్థానం ఉంటుంది. ఎక్కడపడితే అక్కడ పెడితే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. అందుకే మన ఇంట్లో తాళంచెవులను ఏ దిశలో పెట్టాలి అనే విషయాన్ని ప్రస్తుతం తెలుసుకుందాం.

 తాళం చెవులను పూజగదికి దగ్గర పెట్టకూడదు

తాళం చెవులను పూజగదికి దగ్గర పెట్టకూడదు


మన ఇంటి తాళం చెవులను పూజ గది కి దూరంగా పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పూజగదిలో, పూజగది గోడకు తాళంచెవులను పెట్టకూడదు. ఎందుకంటే పూజగది అనేది పవిత్రమైన స్థలం. తాళం చెవులు మనం ఎప్పుడు పడితే అప్పుడు తీస్తూ, పెడుతూ ఉంటాం. కాబట్టి వాటిని పదే పదే తీస్తూ పెడుతూ ఉండడంవల్ల పూజ గది యొక్క పవిత్రత పాడవుతుంది. అందుకే వాటిని పూజ గది దగ్గర కానీ, పూజా స్థలంలో కానీ, పూజ గదిలో గాని పెట్టకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ అలా పెడితే దాని వల్ల దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు.

 తాళం చెవులను వంటగదిలో పడితే శుభ సూచకం కాదు

తాళం చెవులను వంటగదిలో పడితే శుభ సూచకం కాదు


చాలామంది తాళంచెవులను వంటగదిలో పెడుతూ ఉంటారు. వంట గదిలో తాళంచెవులను పెట్టడం కూడా ఆశుభంగా పరిగణించబడుతుంది. వంట ఇది ఆహారం వండడానికి ఉపయోగించే ప్రదేశం. ఇది అన్నపూర్ణ దేవి ఉండే పవిత్ర స్థలం. తాళం చెవులు మెటల్ తో తయారైనవి. అందువల్ల వంటగదిలో తాళంచెవులను పెట్టడం ఏమాత్రం మంచిది కాదని, ఇది శుభ పరిణామం గా పరిగణించబడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

 తాళం చెవులను అందరికీ కనపడేలా పెట్టటం మంచిది కాదు

తాళం చెవులను అందరికీ కనపడేలా పెట్టటం మంచిది కాదు


ఇక కొంతమంది తాళంచెవులను డ్రాయింగ్ రూమ్ లో పెడుతూ ఉంటారు. లేదా హాల్లో అతిథులు కూర్చొనే ప్రదేశం దగ్గర పెడుతూ ఉంటారు. అయితే ఇది కూడా ఏ మాత్రం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంటి తాళం చెవులు ఎప్పుడూ అతిథులకు కనపడకూడదు. వాటి పై ఇతరుల కళ్ళు పడకూడదు. ఒకవేళ అలా మన ఇంటి తాళం చెవులను ఎవరైనా చూస్తే, వారి ఇల్లు మొత్తాన్ని చూసినట్లే అని చెప్తున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. కాబట్టి డ్రాయింగ్ రూమ్లో లేదా హాల్లో తాళంచెవులను పెట్టకూడదని సలహా ఇస్తున్నారు.

 తాళం చెవులు ఈదిశలో ఇలా ఉంటేనే మంచిది

తాళం చెవులు ఈదిశలో ఇలా ఉంటేనే మంచిది


ఇక తాళంచెవులను ఎక్కడ ఉంచాలి అంటే.. తాళం చెవులు మెటల్ తో తయారు చేస్తారు కాబట్టి వాటిని పశ్చిమ దిశలో ఉంచితే మంచిదని చెబుతున్నారు. తాళంచెవులను పెట్టడం కోసం ప్రత్యేకించిన కొంచెం ఖాళీ స్థలం ఉండాలి. తాళంచెవులను పెట్టడానికి ఒక హ్యాంగర్ వేలాడదీసి పెట్టుకుంటే మంచిదని చెబుతున్నారు. దీనికోసం చెక్క హ్యాంగర్ ఉపయోగిస్తే మంచిదని సలహా ఇస్తున్నారు. ఇది అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని చెబుతున్నారు. ఇక తాళాలు పెట్టే హ్యాంగర్ ల పై ఎటువంటి పరిస్థితుల్లోనూ దేవుడి బొమ్మలు లేకుండా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+