Vastu tips: మీ వంటగది ఇలా ఉందా? అయితే దరిద్ర దేవతకు ఆహ్వానం పలికినట్టే!!

ఇల్లు ఏ విధంగా అయితే వాస్తుశాస్త్రం ప్రకారం నిర్మించుకుంటామో, అదేవిధంగా వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిని కూడా నిర్మించుకుంటాం. అయితే వంటగది నిర్మాణంలో వాస్తు నియమాలను పాటించడంతో పాటు, వంట గదిలో సామాను సర్దుకోవడం లో కూడా నియమాలను పాటించాలి. వంట గదిలో సామాను సర్దుకోవడంలో అశ్రద్ధ చేసినా, వంటగదిని అశుభ్రంగా ఉంచినా దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక వంటగది ఏ విధంగా ఉండకూడదు అనే అంశాలను గురించి వివరిస్తున్నారు.

వంటగది ఇలా ఉంటే కుటుంబ సభ్యులకు అనారోగ్యం

వంటగది ఇలా ఉంటే కుటుంబ సభ్యులకు అనారోగ్యం

వంటగదిలో ఎప్పుడూ పాడైపోయిన ఆహారపదార్థాలను ఉంచుకోకూడదు అని ఒకవేళ అలా ఉంచుకుంటే లక్ష్మీదేవికి కోపం వస్తుందని చెబుతున్నారు. వంటగదిలో పురుగులు పట్టిన పిండి పదార్థాలు, పాడైపోయిన పచ్చళ్ళు కూడా ఉంచుకోవడం ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు. ఇక వంటగదిలో డస్ట్ బిన్ లు, చీపురు కట్టలు పెట్టుకోవడం మంచిది కాదని చెబుతున్నారు. వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని, అశుభ్రంగా ఉంచుకోవడం వల్ల సదరు ఇంటి సభ్యులకు అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

వంటగదిని ఇలా పెడితే అరిష్టం

వంటగదిని ఇలా పెడితే అరిష్టం

ఇక వంట గదిలో విపరీతంగా సామాను నింపి ఇరుకుగా మార్చకూడదని, వంటగది గాలి వెలుతురు వచ్చేలాగా ఉండాలని చెబుతున్నారు. వంట గదిలో ఎక్కడ బూజు లేకుండా చూసుకోవాలని, ఎప్పటికప్పుడు సామాన్లను సర్దుకోవాలి అని, కుప్పలుగా పడ వేయకూడదని చెబుతున్నారు. వంటగదిలో తిన్న ప్లేట్లను, ఎంగిలి గిన్నెలను ఎప్పటికప్పుడు శుభ్రంగా తోముకోవాలి అని చెబుతున్నారు. రాత్రి భోజనం చేసిన తర్వాత, షింక్ లో తోమకుండా భోజనం చేసిన ప్లేట్లను పడవేయకూడదని చెబుతున్నారు. ఇక వంటగది అలా పెడితే అరిష్టం అంటున్నారు.

వంటగదిలో ఈ ఐదు వస్తువులు అయిపోతే తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు

వంటగదిలో ఈ ఐదు వస్తువులు అయిపోతే తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు

ఇక వంటగదిలో ఐదు వస్తువులను ఎప్పుడూ అయిపోకుండా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు. వంటగదిలో ఎప్పుడూ పసుపు, ఉప్పు, పిండి, బియ్యం, ఆవనూనె వంటి ఐదు వస్తువులను ఉంచుకోవాలని చెబుతున్నారు. వీటిని ఎప్పుడూ ఖాళీ కాకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. ఒకవేళ ఈ 5 వస్తువులు అయిపోతే తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని సూచిస్తున్నారు. ఇక వంటగదిలో మెడిసిన్స్ ఎప్పుడూ పెట్టకూడదని సూచిస్తున్నారు.

అజాగ్రత్తగా ఉంటే దరిద్ర దేవతకు ఆహ్వానం పలికినట్టే

అజాగ్రత్తగా ఉంటే దరిద్ర దేవతకు ఆహ్వానం పలికినట్టే

వంట గదిలో ఉండే షింక్ ఎప్పుడు ఖాళీగా, శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. వంటగదిని స్టోర్ రూమ్ లాగా ఉపయోగించకూడదని, ఏ సామాను పడితే ఆ సామాను వంటగదిలో పెట్టకూడదని చెబుతున్నారు. ఇక వంట గదిలో పైన పేర్కొన్న విషయాలలో అజాగ్రత్త వహిస్తే దరిద్ర దేవత కు ఆహ్వానం పలికినట్టు అవుతుందని చెబుతున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+