Vastu tips: ఇంట్లో డబ్బు సమస్యలా.. కొబ్బరికాయలతో ఈ పరిహారాలు చెయ్యండి!!

మనం ఎంత కష్టపడినప్పటికీ వాస్తు దోషాల వల్ల చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం రాదు. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితులు కూడా వాస్తు దోషాల కారణంగా ఇబ్బందికరంగా మారుతాయి. ఏ పనిలో విజయం సాధించాలన్నా విజయం సాధించలేని పరిస్థితి వస్తుంది. ఆదాయం తగ్గుతుంది. ఖర్చులు పెరుగుతాయి. వాస్తుదోషాల కారణంగా మనకు తెలియకుండానే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

అయితే అటువంటి వాస్తు దోషాలను అనేక వాస్తు పరిహారాలతో మనం తొలగించుకోవచ్చు. కొబ్బరి కాయలతో చేసే కొన్ని వాస్తు పరిహారాలు మనల్ని ఆర్థిక ఇబ్బందుల నుండి, సమస్యల నుండి గట్టెక్కిస్తాయి. హిందువులు కొబ్బరికాయను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. మన ఇళ్ళల్లో ఏ శుభకార్యం జరగాలన్నా కొబ్బరికాయలను తప్పనిసరిగా ఉపయోగిస్తారు.

ఇంట్లో నిర్వహించే పూజలలో కలశాలలో పెట్టడానికి కొబ్బరి కాయలను వాడతారు. సంపదల దేవతయైన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే అత్యంత ప్రీతి. ఈ కారణంగానే మన పూజలో కొబ్బరికాయకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇక ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వారు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన కొబ్బరికాయను కొట్టి ప్రతి శుక్రవారం పూజలు చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది.

 coconut

అంతేకాదు ఎవరైనా చెడు దృష్టితో మిమ్మల్ని చూసినా, మీ ఆర్థిక పరిస్థితులపై దృష్టి ప్రభావం ఉన్నా కొబ్బరికాయ పరిహారంతో తగ్గించుకోవచ్చు. కొబ్బరికాయకు నల్లటి కాటుక పెట్టి ఆ కొబ్బరి కాయలు మీ చుట్టూ, ఇంటి చుట్టు తిప్పి దానిని ఏదైనా ప్రవహించే నీటి ప్రవాహంలో పడేస్తే, మీపై ఉండే ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గుతుంది. నరదృష్టికి ఈ పరిహారం బాగా పనిచేస్తుంది.

అంతేకాదు ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడాలి అనుకునేవారు శుక్రవారంనాడు లక్ష్మీదేవికి తామర పువ్వులను, తెల్లటి వస్త్రాలను, పెరుగు, తెల్లని స్వీట్లను సమర్పించి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేయాలి. ఆ తర్వాత ఒక ఎర్రటి వస్త్రంలో కొబ్బరికాయను కట్టి ఇంట్లో డబ్బులను పెట్టే చోట భద్రంగా పెట్టాలి. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కే అవకాశం ఉంటుంది.

ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడటం కోసం మంగళవారం నాడు కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయపై కుంకుమతో స్వస్తిక్ చిహ్నాన్ని వేసి, ఆంజనేయస్వామికి కొబ్బరికాయలను సమర్పించాలి. కచ్చితంగా ఏడు వారాల పాటు ఈ నియమాన్ని పాటిస్తే, ఈ పరిహారాన్ని చేస్తే డబ్బు సమస్యల నుంచి గట్టెక్కుతారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+