vastu tips: వేపచెట్టు ఇంటి ముందు తూర్పున ఉంటే శుభమా? అశుభమా? తెలుసుకోండి

వేప చెట్టు వాస్తు దోషాలను తొలగిస్తుంది అని చెబుతూనే వేప చెట్టును ఇంట్లో పెట్టకూడదు అని చెప్తున్నారు. ఒకవేళ ఉంటే వేప చెట్టు ఏ దిశలో ఉండాలి? తూర్పు దిశలో వేపచెట్టు ఉంటే ఏమవుతుంది తెలుసుకుందాం.

హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లు గాను, పవిత్రమైన చెట్లు గాను పేర్కొనబడ్డాయి. అటువంటి పూజనీయమైన చెట్టుగా వేప చెట్టును చెప్పుకోవలసిన అవసరం ఉంది. వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయడమే కాకుండా వాస్తు పరంగాను అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. వేప చెట్టు వాస్తు దోషాలను తొలగిస్తుంది అని చెబుతూనే అసలు వేప చెట్టును ఇంట్లో పెట్టకూడదు అని చెప్తున్నారు. ఒకవేళ ఉంటే వేప చెట్టు ఏ దిశలో ఉండాలి? తూర్పు దిశలో వేపచెట్టు ఉంటే ఏమవుతుంది? వంటి వివరాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

వాస్తు ప్రకారం వేప చెట్టు ఇంట్లో ఉంటే మంచిదా ? కదా? ఎందుకు?

వాస్తు ప్రకారం వేప చెట్టు ఇంట్లో ఉంటే మంచిదా ? కదా? ఎందుకు?


వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వేప చెట్టును పెంచడం మంచిది కాదని చెబుతూ ఉంటారు. వేప చెట్టుని ఇంట్లో పెంచడం వల్ల అశుభ ఫలితాలను ఇస్తుందని పలువురు వాస్తు నిపుణులు చెబుతారు. అందుకు కారణం లేకపోలేదు. వేప చెట్టు మహావృక్షం అవుతుంది. దాని పేర్లు ఇంటి గోడలలోకి వ్యాపించినప్పుడు గోడలు నెర్రెలు బారతాయి. అలా క్రాక్స్ వచ్చిన గోడలు ఇంటికి అశుభాన్ని తీసుకువస్తాయి. కాబట్టి ఇంట్లో ఎవరూ వేప చెట్లను పెంచకూడదని చెబుతున్నారు. ఒకవేళ వేప చెట్టును పెంచినా కాంపౌండ్ వాల్ బయట రోడ్డుపైన పెంచితే మంచిదని చెబుతున్నారు.

ఆ దిశలలోనే వేపచెట్టు పెంచితే మంచిది

ఆ దిశలలోనే వేపచెట్టు పెంచితే మంచిది

అయితే ఇంటికి సమీపంలో ఏ దిశలో పడితే ఆ దిశలో వేప చెట్టును పెంచడం మంచిది కాదని చెబుతున్నారు. వేప చెట్టును పెంచాలనుకుంటే ముఖ్యంగా కాంపౌండ్ వాల్ బయటనే పెంచుకుంటే మంచిదని చెబుతున్నారు. దక్షిణ దిశలోనే పెంచాలని, లేదంటే పశ్చిమ దిశలో వేప చెట్టును పెంచుకోవాలని చెబుతున్నారు. ఈ దిశలలో వేప చెట్లను పెంచడం వల్ల ఇంట్లో సుఖశాంతులు వెల్లి విరుస్తాయని చెబుతున్నారు. చాలామంది ఇంటికి తూర్పు వైపున, ఇంటి ముందు వేప చెట్లను పెట్టి పెంచుతూ ఉంటారు. అయితే వాస్తు ప్రకారం ఇది మంచిది కాదని ఆ చెట్లను కొట్టేయాలని చాలామంది చెబుతూ ఉంటారు .

తూర్పు దిశలో వేపచెట్టు ఉంటే ఏమవుతుంది? పరిహారం ఏమిటి?

తూర్పు దిశలో వేపచెట్టు ఉంటే ఏమవుతుంది? పరిహారం ఏమిటి?

అయితే వేదిక్ మహా వాస్తు ప్రకారం తూర్పు దిశలో కాంపౌండ్ వాల్ బయట ఉన్న చెట్లను కొట్టేయాల్సిన అవసరం లేదు. తూర్పు దిశలో వేపచెట్టు ఉండటం వల్ల వాస్తు దోషం కలిగి పనులకు ఆటంకం కలుగుతుంది. ఇక ఈ వాస్తు దోషం తొలగి పోవాలంటే కూడా ఒక చక్కని రెమిడి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ తూర్పు దిశలో వేప చెట్టు ఉంటే గురు శుక్రవారాల్లో ఆ వేప చెట్టుకు పూజలు చేయాలని, అంతేకాదు ఆ వేప చెట్టుకు 108 పసుపు దారాలను చుట్టి పూజించాలని చెబుతున్నారు. ఇలా చేస్తే వాస్తు దోషం తొలగిపోయి, పనుల ఆటంకాలు తొలగి అంతా మంచి జరుగుతుందని చెబుతున్నారు.

వేపచెట్టు దేవతా స్వరూపం.. నీళ్ళు పోసి పూజిస్తే మంచి ఫలితాలు

వేపచెట్టు దేవతా స్వరూపం.. నీళ్ళు పోసి పూజిస్తే మంచి ఫలితాలు


ఇక చాలామంది సాధారణంగా ఇంట్లో వేపచెట్టు ను పెట్టేందుకు పెద్దగా ఇష్టపడరు. దుర్గామాత వేపచెట్టు లో నివసిస్తుందని చాలామంది విశ్వసిస్తారు. అందుకే వేప చెట్టును ఇంటి ప్రాంగణంలో పెట్టుకుంటే ప్రతి ఆదివారం దానికి నీళ్లు పోసి, దుర్గాదేవి అనుగ్రహం కలిగేలా దానిని పూజించాలని చెబుతున్నారు. వేప చెట్టును పెంచడం వల్ల శత్రువులు అంతమవుతారని కొందరు బలంగా విశ్వసిస్తారు. వేప చెట్టు ఇంటి వద్ద ఉండడం వల్ల చాలా రకాల చెడు దృష్టి, నరదృష్టి మాయమవుతుందని, ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెబుతారు. అయితే వాస్తు నిపుణుల సూచనల మేరకే వేప చెట్టును పెంచుకోవడం మంచిదని చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+