vastu tips: పూజలు చేసినా ఫలితం లేదా? అయితే తప్పులు చేస్తున్నారేమో.. చూసుకోండి!!

చాలామంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. పూజలు, మతపరమైన ఆచారాలు పాటించడం ద్వారా కూడా చాలామంది తమ జీవితాల నుండి సమస్యలను తొలగించలేరు. ఎప్పుడు సమస్యలతో సతమతం అవుతూనే ఉంటారు. ఎన్ని పూజలు చేసిన ఎందుకు తమకు కష్టాలు ఉంటున్నాయి. ఎన్ని పూజలు చేసిన తమ సమస్యలు ఎందుకు తీరడం లేదు? కష్టాల నుండి ఎందుకు తాము గట్టెక్కడం లేదు? అని చాలామంది ఆవేదనకు గురవుతూ ఉంటారు.

అయితే ఈ ప్రశ్నలకు సమాధానం పొందాలంటే పూజ సమయంలో ఏవైనా తప్పులు చేస్తున్నారేమో ఒకసారి చెక్ చేసుకోవాలి. పూజ చేసేటప్పుడు మనకు తెలియకుండా చేసే కొన్ని తప్పులు మనకు పూజల యొక్క ఫలితం రాకుండా చేస్తాయి. ఇంట్లో ఉన్నటువంటి దేవుని గదిలో, పూజ మందిరంలో విపరీతమైన దోషం ఉంటే పూజకు తగిన ఫలితం లభించదు. పూజ సమయంలో శుభ్రమైన బట్టలు ధరించాలి. పరిశుభ్రత కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి.

vastu tips:

పూజగదిని పొరపాటున కూడా దుమ్ముగా ఉంచకూడదు. శుభ సమయంలోనే పూజలు క్రమం తప్పకుండా చేయాలి. ఈ నియమాన్ని పాటించకపోతే పూజ నుంచి ఎటువంటి ప్రయోజనాలు లభించదు. ఇంట్లో పూజించే స్థలం అందరూ ఎక్కువగా తిరిగే స్థలంగా ఉండకూడదు. పూజ చేసి, ధ్యానం చేసుకోవడానికి ఏకాంతంగా ఉండే స్థలాన్ని ఎంచుకోవాలి. ఇంట్లో పూజించే దేవత మూర్తుల విగ్రహాలను, ఫోటోలను పెట్టే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.

దుర్గాదేవి విగ్రహం, శని విగ్రహం, ఉగ్ర నరసింహ స్వామి విగ్రహం వంటివి పూజ గదిలో పెట్టకూడదు. వీటి వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది. పూజ చేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని పూజ అయిన వెంటనే తీసి మర్చిపోకుండా ప్రసాదంగా స్వీకరించాలి. నైవేద్యాన్ని అలాగే దేవుడి దగ్గర వదిలేయడం ఏ విధంగానూ మంచిది కాదు.

దేవుడికి పచ్చిపాలు నైవేద్యంగా పెట్టకూడదు. కాచి చల్లార్చిన పాలను అభిషేకానికి వాడకూడదు. పూజకు ఉపయోగించిన పూలను ఎక్కడపడితే అక్కడ పడేయ కూడదు. పగిలిపోయిన దేవుని పటాలను వాడకూడదు. ఎత్తయిన విగ్రహాలను పూజలో ఉపయోగించ కూడదు. ఇలా పూజకు కొన్ని నియమాలను తెలుసుకుని పాటిస్తే జీవితంలో శ్రేయస్సు వెల్లి విరుస్తుంది.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+