vastu tips: మెట్ల క్రింద ఈ వస్తువులను పెడుతున్నారా? దరిద్రదేవత తిష్ట వేస్తుంది జాగ్రత్త!!
ఇంటిని వాస్తు నియమాలను అనుసరించి ఏ విధంగా అయితే నిర్మించుకోవాలో అలాగే ఇంట్లో పెట్టుకునే వస్తువులను కూడా వాస్తు నియమాలను అనుసరించి పెట్టుకోవాలి అన్న విషయం తెలిసిందే. అంతే కాదు ఇంట్లో మెట్ల నిర్మాణం సరైన దిశలో చేయడమే కాకుండా, మెట్ల కింద పెట్టే వస్తువుల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. లేదంటే దరిద్ర దేవత తిష్టవేసుకుని కూర్చుంటుంది అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
చాలామంది మెట్లకింద ఖాళీగా ఉందని అక్కడ ఇంట్లో ఉపయోగించిన అనేక వస్తువులను పెడుతూ ఉంటారు. మెట్ల కింద ఏమి పెట్టొచ్చు ఏమి పెట్టకూడదు అనే సరైన జ్ఞానం లేకపోవడం వల్ల మెట్ల కింద స్థలాన్ని ఇష్టారాజ్యంగా ఉపయోగిస్తూ ఉంటారు. దీనివల్ల దోషాలు కలుగుతాయి అని చెబుతున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉన్న ప్రతి చిన్న, పెద్ద వస్తువు ఆ ఇంట్లోని వ్యక్తుల యొక్క ఆర్థిక, శారీరక, మానసిక పరిస్థితులపై శుభ లేదా అశుభ పరిణామాలను కలిగిస్తూ ఉంటాయి.చాలామంది ఇంట్లో స్థలం లేదని మెట్ల కింద వస్తువులను పెడుతూ ఉంటారు. మెట్లు తూర్పు దిశలో నిర్మించిన, మెట్ల కింద చెత్తాచెదారం జమ చేసినా ఆర్థిక నష్టంతో పాటు గా కుటుంబం కలహాలు పెరుగుతాయి.
ఇక మెట్లకింద చేయకూడని కొన్ని పనుల విషయానికి వస్తే పొరపాటున కూడా మెట్లకింద టాయిలెట్ నిర్మించకూడదు. స్టోర్ రూమ్స్ ఏర్పాటు చేయకూడదు. మెట్ల నిర్మాణం ఎప్పుడు దక్షిణ దిశ వైపు లేదా పశ్చిమ దిశ వైపు ఉండాలి. పొరపాటున కూడా ఉత్తరం, తూర్పు దిశ వైపు ఉండకూడదు. ఉత్తరం, తూర్పు దిశలో నిర్మించిన మెట్లు ఆర్థిక నష్టం కలిగిస్తాయి.
మెట్లకింద బూట్లు, చెప్పులు, ఇనుప వస్తువులు పెట్టకూడదు. మెట్ల కింద చెత్త బుట్టలను పెట్టకూడదు. పగిలిపోయిన ఫ్యామిలీ ఫోటోలు, లేదా ఇంట్లో పాడైపోయిన వస్తువులు వంటివి మెట్ల కింద పెట్టకూడదు. ఇవన్నీ వాస్తుదోషాలుగా మారి కుటుంబంలో ఉద్రిక్తతకు కారణమవుతాయి. ఆర్థిక కష్టాలను, అనవసరమైన కష్టాలను కలిగిస్తాయి. దరిద్రదేవతకు ఆహ్వానం పలుకుతాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
ఖాళీ స్థలం ఉంది కదా అని గది కడుతున్నారా? కానీ వాస్తు ఏం చెబుతోందో తెలుసా? -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం ఇంట్లో డస్ట్‌బిన్ ఎక్కడ పెడుతున్నారు? -
మఖా నక్షత్రంలోకి కేతువు సంచారం.. మకరరాశితో సహా ఆ రాశులవారికి పండుగే! -
ఏప్రిల్ లో అదృష్ట లక్ష్మి వరించే రాశులివే! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
నవ పంచమ రాజయోగంతో ఏప్రిల్ లో వీరికి జాక్ పాట్.. తగ్గేదే లేదు! -
today rashiphalalu: శ్రీరామనవమి నాడు వీరికి నవవిధ శుభాలు ప్రసాదించిన అద్భుత యోగాలు -
100ఏళ్ల తర్వాత శని మంగళ యుతి.. ఏప్రిల్ లో ఈ రాశులకు డబ్బే డబ్బు! -
జన్మ నక్షత్రం రోహిణి, మృగశిర, ఆరుద్ర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!












Click it and Unblock the Notifications