వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Vastu tips: నరదృష్టితో బాధపడుతున్నారా? ఈ చిన్న చిట్కాలతో నరదృష్టికి చెక్ పెట్టండి!!

|
Google Oneindia TeluguNews

చాలామంది ఇంటికి వాస్తు నియమాలు ఉన్న, ఎటువంటి వాస్తు సమస్యలు లేకపోయినా, ఎలాంటి దోషాలు లేకున్నా రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. నరదృష్టితో వారు బాధపడుతున్నారని చాలా సందర్భాలలో చాలా మంది చెబుతుంటారు. అసలు ఈ నరదృష్టి ఏంటి? దీనిని పోగొట్టుకోవడం కోసం ఎటువంటి చిట్కాలను పాటించాలి? జ్యోతిష శాస్త్ర పండితులు ఈ విషయంలో ఏం చెబుతున్నారు వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

నరదృష్టి అంటే ఇదే .. నరదృష్టితో అనేక సమస్యలు

నరదృష్టి అంటే ఇదే .. నరదృష్టితో అనేక సమస్యలు

నరదృష్టి అంటే మనపైన మనకు తెలిసిన వాళ్ల, బంధువుల, పక్క వాళ్ళ విపరీతమైన ఆసక్తి తో కూడిన ఫోకస్ ను నరదృష్టి అంటారు. మనకు పక్కన వాళ్ళతో పట్టింపు లేకున్నా పక్కన వాళ్ళు మన గురించి పదేపదే ఆరా తీయటం కూడా నరదృష్టి గానే భావించాలి. మీకేంటి అని పదేపదే మన విషయంలో ఎవరు అన్నా కూడా దిష్టి అనే చెప్తారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదు. నరదృష్టి కి నాపరాళ్ళు కూడా బద్దలు అవుతాయని నానుడి. నరదృష్టి ఎక్కువగా ఉన్నవారు ఇళ్లల్లో ఎప్పుడూ రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే అటువంటి నరదృష్టి నుంచి బయట పడటం కోసం కొన్ని చిట్కాలను పాటిస్తే మంచిదని చెబుతున్నారు.

నరదృష్టి నివారణా చిట్కాలు

నరదృష్టి నివారణా చిట్కాలు

సాధారణంగా నరదృష్టి తగిలిందని భావించినపుడు చాలా మంది కల్లు ఉప్పును మూడుసార్లు సదరు మనిషి చుట్టూ తిప్పి బయట పడేస్తూ ఉంటారు. కొంతమంది ఎండుమిరపకాయలు, చీపురు కట్ట వంటి వాటితోనూ దిష్టి తీస్తూ ఉంటారు. ఇవి మాత్రమే కాకుండా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు నర దిష్టి తొలగిపోవాలంటే మరి కొన్ని చిట్కాలను చెప్పారు. విపరీతంగా నరదృష్టి ఉన్నవారు నిమ్మ పండును సగానికి కోసి మధ్యలో కుంకుమ అద్ది వాటిని గుమ్మానికి ఇరువైపులా ఉంచితే అదికూడా మంగళవారం రోజున చేస్తే నరదృష్టి తొలగిపోతుందని చెబుతున్నారు.

ఇలా చేస్తే కూడా నరదృష్టి నుండి కాస్త ఉపశమనం

ఇలా చేస్తే కూడా నరదృష్టి నుండి కాస్త ఉపశమనం


అంతేకాదు పచ్చ కర్పూరం, కస్తూరి పసుపు, అత్తరును, గోమూత్రంలో కలిపి ఇంట్లోనూ, వ్యాపారం చేసే చోట చల్లితే నరదృష్టి తొలగిపోతుందని, ఆర్థిక ఇబ్బందులు తొలగి, ఆదాయం వస్తుందని చెబుతున్నారు. ఇక నరదృష్టి వల్ల రుణబాధలు వస్తే, వినాయకుడి ఆలయంలో పూజలు చేస్తే కాస్త దృష్టి దోషం నుంచి ఉపశమనం దొరుకుతుందని చెబుతున్నారు. అంతేకాదు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల, గుమ్మం దగ్గర కను దిష్టి వినాయకుడు ఫోటో పెట్టడం వల్ల ఎటువంటి నరదృష్టి అయినా పటాపంచలు అవుతుందని చెబుతారు.

నరదృష్టిని పట్టించుకోకుంటే ఇంట్లో చిరాకులు, అనారోగ్య సమస్యలు

నరదృష్టిని పట్టించుకోకుంటే ఇంట్లో చిరాకులు, అనారోగ్య సమస్యలు

అప్పుడప్పుడు ఇంటిని ఉప్పు నీటితో శుభ్రం చేసుకోవడం, ఇంటి గదిలోని అన్ని మూలలకు ఉప్పు పోయడం వంటివి కూడా నరదృష్టి నుంచి ఉపశమనం కలిగిస్తాయి అని చెబుతున్నారు. ఇక ఇంటి ముందు పచ్చని పువ్వులు పూసే చెట్లను పెంచడం కూడా నరదృష్టిని మన పైనుంచి, వాటిపైకి మళ్లిస్తాయని చెబుతున్నారు. ఈ చిన్న చిన్న చిట్కాలతో నరదృష్టి నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు. నరదృష్టి తొలగించుకోవటం కోసం ఇలా చిన్న చిన్న చిట్కాలు పాటించకుంటే అనవసరపు చిరాకులు, అనారోగ్య సమస్యలు ఇంట్లో పెరుగుతాయని చెప్తున్నారు. అందుకే నరదృష్టి విషయంలో తస్మాత్ జాగ్రత్త.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Suffering from naradrushti or nara dishti problems? But check the perception with small tips made with salt and lemons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X