vastu tips: ఇంట్లో అశుభాలను కలిగించే వాస్తుదోషాలు ఇవే.. తస్మాత్ జాగ్రత్త!!

మన ఇంట్లో, ఇంటి ముందు మనకు తెలియకుండానే కలిగే వాస్తు దోషాలు మనకు అశుభాలను తీసుకు వస్తాయి. ఇంటిని నిర్మించుకునేటప్పుడు మాత్రమే కాకుండా, ఇంటిని నిర్వహించే క్రమంలో కూడా వాస్తు నియమాలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వాటిని పట్టించుకోకపోతే కుటుంబంలో సుఖశాంతులు లోపిస్తాయి. ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా మారతాయి. కాబట్టి కొన్ని విషయాలలో మనం జాగ్రత్తలు తీసుకుంటే అశుభాలను నివారించవచ్చు.

హిందూ మతంలో వాస్తు శాస్త్రానికి విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది. వాస్తు శాస్త్రంలో పేర్కొన్న నియమ నిబంధనలు పాటించడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు వెల్లివిరుస్తుంది. అందుకే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వాస్తు ప్రకారం ఇంటి ముందు పెద్ద చెట్టు ఉండకూడదు. ఇది మీ జీవితంలో పురోగతిని అడ్డుకుంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

vastu tips: These are the Vastu Doshas that causes bad luck in the house !!

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ముందు ప్రధాన తలుపు ఎప్పుడూ లోపభూయిష్టంగా ఉండకూడదు. రిపేర్లు ఉన్నా వెంటనే వాటిని చేయించాలి. ఇంటి ప్రధానద్వారం దెబ్బతినడం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు చోటుచేసుకుంటాయి. కాబట్టి ఇంటి ప్రధాన ద్వారం విషయంలో జాగ్రత్త వహించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి తలుపు ముందు బావి ఉండకూడదు. ఒకవేళ అలా ఉంటే ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వస్తుంది. అది కుటుంబంలోని శాంతిని దూరం చేస్తుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం బరువైన వస్తువులను ఎప్పుడు ఇంటికి నైరుతి దిశ లోనే ఉంచాలి. ఇంటికి నైరుతిలో బరువైన వస్తువులను ఉండటంవల్ల రాహు గ్రహానికి శాంతి చేకూరుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం నైరుతి దిశలో మరుగుదొడ్డి నిర్మించకూడదు. ఈ దిశలో మరుగుదొడ్లు ఉండటంవల్ల రాహువు యొక్క ప్రభావం కచ్చితంగా ఆ కుటుంబం పైన ఉంటుంది.

అంతే కాదు ఇంటి మధ్యలో ఎప్పుడూ ఖాళీ ప్రదేశం ఉండాలి. ఇంటి మధ్యలో బరువు ఉండకూడదు. అందుకే మన పూర్వీకులు ఇళ్ల మధ్యలో ఖచ్చితంగా ఖాళీ ప్రదేశం ఉండేలా నిర్మించుకునే వారు. ఇక ఈ విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటే అశుభాలను దూరం చేసుకోవచ్చు.

Disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+