vastu tips: దీపారాధనలో వాడే ఒక్కో నూనెతో ఒక్కో ప్రయోజనం.. తెలుసుకోండి!!
సహజంగా ప్రతి ఒక్కరి ఇళ్లలో దీపారాధన చేస్తూ ఉంటారు. నిత్యం దీపారాధన చేయడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ శక్తి వస్తుందని, ప్రతికూల శక్తులు ఇంటి నుండి బయటకు వెళతాయని చాలామంది విశ్వసిస్తారు. దీపారాధన చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ రావడమే కాకుండా అనేక ఇతర సమస్యలు, గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఇంతకీ దీపారాధనలో ఎలాంటి నూనెలు వాడాలి? ఏ నూనెను వాడితే ఎటువంటి సమస్యలు తొలగిపోతాయి? అనే విషయాన్ని ప్రస్తుతం మనం ఇక్కడ తెలుసుకుందాం.

దీపారాధనకు నువ్వుల నూనె, ఆవు నెయ్యి.. ఫలితాలివే
సహజంగా మనం నువ్వుల నూనెతోనే దీపారాధన చేస్తాం. నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల కోరికలు నిదానంగా తీరుతాయని, నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శ్రేయస్కరమని చెప్పబడింది. ఇక ఆవునెయ్యితో దీపారాధన చేస్తే మనసులో ఉన్న ఎటువంటి కోరికలైనా త్వరితగతిన తీరుతాయని చెబుతున్నారు. అన్ని నూనెల కంటే ఆవు నెయ్యి తో దీపారాధన చాలా శ్రేష్టం అని చెప్తున్నారు. నిత్యం లక్ష్మీ కటాక్షం కావాలనుకునేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేయడం మంచిదని చెబుతున్నారు.

ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే దీపారాధనలో ఈ నూనెలు వాడండి
శత్రు పీడ తొలగిపోవడానికి, గండాల నుండి బయటపడడానికి, అలాగే ఆస్తి వివాదాలు పరిష్కారం కావడానికి, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల అనారోగ్య బాధలు తగ్గడానికి తెలుపు నువ్వుల నూనె దీపారాధనకు వినియోగిస్తే ఎంతో మంచిదని చెబుతున్నారు. నిత్యం తెలుపు నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. అనేక సమస్యల నుండి తెలుపు నువ్వుల నూనె గట్టెక్కిస్తుంది అని చెప్తున్నారు.

కొబ్బరినూనె, ఆముదం దీపారాధనకు వాడితే ఫలితం ఇలా
ఇక విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడుతూ, అప్పుల బాధలు తీరాలి అనుకునేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం మంచిదని సలహా ఇవ్వబడింది. కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే మంచి ఫలితముంటుందని చెబుతున్నారు. అంతేకాదు ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న వివాదాలు పరిష్కారం కావాలి అంటే ఆముదం తో దీపారాధన చేయడం మంచిదని చెబుతున్నారు. ఇక గంధం నూనెతో దీపారాధన చేయడం వల్ల రుణ బాధలు తొలగిపోతాయని చెబుతున్నారు. లక్ష్మీ కటాక్షం లభిస్తుందని అంటున్నారు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications