Vastu tips: ఇంట్లోకి ఐశ్వర్యం రావాలంటే ఈ ఒక్క మొక్క చాలు!!
చాలామంది వాస్తు నియమాల ప్రకారం ఇల్లు కట్టుకున్నప్పటికీ అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని బాధపడుతూ ఉంటారు. ఎంత కష్టపడినా సంపాదించింది వృధాగా ఖర్చు అయిపోతుందని, ఆర్థిక వృద్ధి కలగడం లేదని ఫీల్ అవుతూ ఉంటారు. అటువంటి వారు ఇంట్లో కలబంద మొక్క ను పెట్టుకోవడం వల్ల సంపద వృద్ధి జరుగుతుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఇంట్లో కలబంద మొక్కను నాటడం వల్ల అదృష్టం పెరుగుతుంది.
అయితే కలబంద మొక్కను ఇంట్లో నాటేటప్పుడు కొన్ని విషయాల పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని కూడా చెబుతున్నారు. కలబంద మొక్కను ఇంట్లో పెట్టేటప్పుడు సరైన స్థలంలో పెడితే కీర్తికి, సంపదకు, ఆనందానికి లోటు ఉండదని చెబుతున్నారు. పొరపాటున కూడా కలబంద మొక్కను ఇంటికి వాయువ్య దిశలో పెట్టకూడదని, ఒకవేళ అలా పెడితే అది చెడు ఫలితాలను ఇస్తుంది అని చెబుతున్నారు.

జీవితంలో శ్రేయస్సు మరియు ఆనందం కావాలంటే ఇంటికి పశ్చిమ దిశలో కలబంద మొక్కను నాటవచ్చని చెబుతున్నారు. అంతేకాదు పశ్చిమదిశలో కలబంద మొక్కను నాటడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కలబంద మొక్కను ఆగ్నేయంలో ఉంచడం వల్ల కుటుంబ సభ్యులకు విజయం మరియు పురోగతి కలుగుతుందని చెబుతున్నారు.
కలబంద మొక్కను తూర్పు దిశలో నాటడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని, కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా జీవించటానికి ఇది దోహదం చేస్తుందని చెబుతున్నారు. కలబంద మొక్క ఇంటికి సానుకూల శక్తిని తీసుకొస్తుంది ఇంట్లో శాంతి, సంతోషాలు వెల్లివిరిసేలా చేస్తుంది. కలబంద మొక్క ఇంట్లో ఉంటే రోగాలు దూరమవుతాయని, ధనధాన్యాలతో లోటు ఉండదని చెబుతారు.
కాబట్టి జీవితంలో ఆర్థిక ఇబ్బందులను, ఇంట్లో చిరాకులను దూరం చేసుకోవాలంటే ఇంట్లో కలబంద మొక్క లను తెచ్చి సరైన దిశలో పెట్టండి. ఇంట్లో సానుకూలత కలిగించి, ప్రతికూలతలు తొలగించటం కోసం సాధ్యమైతే కలబంద మొక్కను తూర్పు, ఉత్తరం దిశలలోనే పెట్టండి. ఇది మీకు, మీ కుటుంబానికి శ్రేయస్సును, సంపదను తప్పకుండా తీసుకువస్తుంది.ఇది ఇంటికి కావాల్సిన పాజిటివ్ వైబ్ ను ఇస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు శాస్త్ర నిపుణుల అభిప్రాయం, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications