Vastu tips: ఆత్మవిశ్వాసం కోసం ఈ చిట్కాలు ట్రై చెయ్యండి.. రిజల్ట్స్ మీరే చూడండి!!
ఒక వ్యక్తి ఎంతో కష్టపడి పని చేసినప్పటికీ విజయం సాధించలేకపోతున్నారు అంటే వారిలో దృఢమైన ఆత్మవిశ్వాసం లేదు అని అర్థం. ఆత్మవిశ్వాసంతో ప్రతి రంగంలోనూ అద్భుతాలు చేయవచ్చు. గొప్పగా రాణించవచ్చు. అయితే మనలో ఆత్మవిశ్వాసం పెరగాలంటే కొన్ని వాస్తు చిట్కాలు కూడా ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి వాస్తు నిపుణులు సూచించిన కొన్ని వాస్తు చిట్కాలను పాటించినట్లయితే మీరు మీ జీవితంలో వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరం ఉండదని చెప్తున్నారు.

ఆత్మవిశ్వాసం పెరగాలంటే ఇవి ధరించండి
ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి అనుకునేవారు ముఖ్యంగా మీ చేతికి పగడంతో తయారు చేసిన ఉంగరాన్ని పెట్టుకోండి. పగడపు రాయికి కుజుడు అధిపతి. ఈ రత్నాన్ని ధరించడం వల్ల కుజుడు బలవంతుడవుతాడు. ఫలితంగా మీ జీవితంలో మీకే తెలియకుండా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇక ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలంటే మీరు మీ గదిలో ఉదయించే సూర్యుడు చిత్రాన్ని, గుర్రం చిత్రాన్ని ఉంచుకోవచ్చని చెబుతున్నారు. వీటివల్ల ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా, ప్రతికూల ప్రభావం లేకుండా ఉంటుంది.

ఆత్మవిశ్వాసం కోసం సూర్యుడిని ఇలా ప్రార్ధించండి
ఇక ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలనుకునేవారు ఉదయాన్నే నిద్ర లేచి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలని, ఒక చెంబెడు నీళ్లు తీసుకొని సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి, ఆయనను మనస్ఫూర్తిగా పూజించాలని చెబుతున్నారు. ఆదిత్య హృదయం స్తోత్రాన్ని క్రమం తప్పకుండా పాటించాలని, సూర్య భగవానుడికి నీటిని సమర్పించడం వల్ల ఆయన మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తారని చెబుతున్నారు.

ఆత్మవిశ్వాసం కోసం గోమాతకు ఇవి పెట్టండి
ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలనుకునేవారు ఆవుకు ఆహారాన్ని పెట్టడం అసలు మర్చిపోకండి. ఆవుకు పచ్చి గడ్డి తినిపించడం వల్ల బుధ గ్రహ స్థితి బలపడుతుందని, మనసు ప్రశాంతంగా ఉంటుందని చెబుతున్నారు. హిందువులు పవిత్రంగా పూజించే ఆవుకు గడ్డి కానీ, ఆహారం కానీ తినిపించడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చెబుతున్నారు.

ఆత్మవిశ్వాసం కోసం ఇంట్లో ఈ పని చెయ్యండి
ఇక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలనుకునేవారు ఇంట్లో ఎప్పుడూ నెగిటివ్ ఎనర్జీ లేకుండా చూసుకోవాలి. ఇంటి కిటికీలు తెరిచి ఇంట్లోకి సూర్యకాంతి వచ్చేలా చూడాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అంతేకాదు కిటికీకి ముందు మీరు వెన్ను చూపించి కూర్చోకూడదని కూడా గుర్తుంచుకోవాలి. ఇది శక్తిని హరించి విశ్వాసాన్ని తగ్గిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలనుకునే వారు ఇంట్లో పర్వత చిత్రాన్ని పెట్టుకుంటే మంచిదని చెబుతున్నారు. ఉదయాన్నే గాయత్రి మంత్రాన్ని జపించడం వల్ల కూడా ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుందని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
జన్మ నక్షత్రం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ ఫోటోలో ఉన్న గుడ్లగూబను కనిపెట్టగలరా..? -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరు నక్కతోక తొక్కుతున్నారు! -
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
జన్మ నక్షత్రం హస్త, చిత్త, స్వాతి ఉన్నవారికి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం సంపద కోసం ఇంట్లో పెంచాల్సిన 5 మొక్కలు ఇవే! -
ఏప్రిల్ లో అదృష్ట లక్ష్మి వరించే రాశులివే! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !!












Click it and Unblock the Notifications