vastu tips: ఇంట్లో ఈ 5చోట్ల తులసిమొక్క పెడితే ఐశ్వర్యం, ఆనందం కోల్పోతారు; జాగ్రత్త!!

హిందూమతంలో తులసి చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇంట్లో తులసి మొక్కను నాటడం వల్ల ఇంటి నుండి ప్రతికూలత దూరం చేయబడుతుంది అని హిందువులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. తులసి శ్రీమహావిష్ణువుకు చాలా ప్రీతికరమైన మొక్క. తులసి మొక్కలో లక్ష్మీదేవి కూడా నివసిస్తుందని చాలామంది నమ్ముతారు. తులసి మొక్కను ఏ దిశలో పెట్టుకోవాలి? తులసి మొక్కను పెట్టకూడదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.

వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కకు సంబంధించిన కొన్ని అంశాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన అవసరం ఉంది. అయితే తులసి మొక్కను ఏ దిశలో పెట్టాలి అనేది తెలుసుకునే ముందు తులసి మొక్కను అసలు ఏ దిశలో పెట్టకూడదు? ఎక్కడ పెడితే మంచిది కాదు అనేది తెలుసుకోవాలి. ఇంట్లో తులసి మొక్కను మురికిగా ఉన్నచోట పెట్టకూడదు. ఇంట్లో తులసి మొక్కను చీకటిగా ఉన్న మూలలో ఎప్పుడు వెలుతురు రానిచోట పెట్టకూడదు.

vastu tips: tulasi plant in these 5 places in the house, you will lose wealth and happiness!!

తులసి మొక్క ఎప్పుడు పచ్చగా ఉండేలా చూసుకోవాలి. తులసి మాతకు ఎదురుగా వినాయకుడి చిత్రం ఎప్పుడు పెట్టకూడదు. అలా పెట్టడం ఏ విధంగానూ మంచిది కాదు. తులసి మొక్క ఇంటికి సంపదను తీసుకువస్తుందని చెబుతారు కాబట్టి తులసి మొక్క చుట్టూ ఎప్పుడూ శివుడు చిత్రాలను పెట్టకూడదు.

తులసి మొక్కను పొరపాటున కూడా ఇంటి పైకప్పు పై పెట్టకూడదు. అలా పెడితే అది ఇంట్లోకి పేదరికాన్ని తీసుకువస్తుంది. మరియు ఇంట్లో ఆనందాన్ని నశింప చేస్తుంది. తులసి మొక్కను ఇంటికి ఉత్తర దిశలో కానీ తూర్పు దిశలో కానీ పెడితే అదృష్టంతో పాటు సంపద కూడా కలుగుతుంది.

ఉత్తర ఈశాన్య దిశలో తులసి మొక్కను నాటడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది. పొరపాటున కూడా తులసి మొక్కను దక్షిణ దిశలో పెట్టకూడదు. ఈ దిశలో తులసి మొక్కను నాటితే మంచి కంటే ఇంట్లో చెడు ఎక్కువగా జరుగుతుంది. కనుక తులసి మొక్కను ఎక్కడ పెట్టాలో ఎక్కడ పెట్టకూడదో ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి.

disclaimer: ఈ కథనం వాస్తు నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+