vastu tips.. పిల్లలు వ్యసనాలకు బానిసలై చదువుకోవటం లేదా?
చాలామంది పిల్లలు తల్లిదండ్రుల మాట సరిగ్గా వినకుండా, సరిగ్గా చదువుకోకుండా, చెడు సహవాసాలు పట్టి తిరుగుతూ ఉంటారు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఎంత బుద్ధి చెప్పినప్పటికీ మగ పిల్లలు కొందరు విపరీతమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇంట్లో డబ్బులు దుబారా ఖర్చులు చేయడం, సరిగ్గా చదవకపోవడం ,ఇతర విద్యార్థులతో గొడవలు పెట్టుకోవడం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం, దుర్వ్యసనాలకు లోను కావడం చేస్తూ ఉంటారు.
ఆగ్నేయ వాస్తు దోషంతో నష్టాలు
అయితే పిల్లలు అలా ఉంటె ఒకసారి కచ్చితంగా ఒక్కసారి మీ ఇంట్లో వాస్తు దోషాన్ని సరి చేయించుకోండి. ఇంటికి ఆగ్నేయంలో వాస్తు దోషం ఉంటే కుటుంబ సభ్యులు మనశ్శాంతితో జీవించలేరు. ముఖ్యంగా పిల్లలపైన ఈ ప్రభావం పడుతుంది. పిల్లలు ఈ విధంగా చెడు వ్యసనాలకు బానిస కావటం, చెప్పిన మాట వినకుండా జులాయిగా తిరగడం ఇలాంటివన్నీ ఆగ్నేయ వాస్తు దోషంతోనే జరుగుతాయి.

ఆగ్నేయ దిశలో చిన్న తప్పు చేసినా తీవ్ర పరిణామాలు
తూర్పు దక్షిణ దిక్కుల మధ్య ఉండే మూలను ఆగ్నేయంగా చెబుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం వంటగది ఆగ్నేయ దిశలో ఉంటుంది. అయితే ఆగ్నేయ దిశలో వాస్తు దోషాలు ఉంటే తీవ్ర ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఆగ్నేయ దిశ పైన మిగతా అన్ని దిశలపైన కంటే ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఆగ్నేయ దిశ విషయంలో ఏమాత్రం చిన్న పొరపాటు చేసినా తీవ్ర ప్రభావాలను ఫేస్ చేయాల్సి వస్తుంది.
ఆగ్నేయం ఇలా ఉంటే వాస్తు దోషం
ఆగ్నేయ దిశలో నైరుతి కంటే ఎత్తు పెరిగినా, గోతులు ఉన్నా, ఆగ్నేయ దిశలో తలుపులు ఉన్నా, వాస్తు దోషమే అవుతుంది అందుకే ఆగ్నేయ భాగంలో ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నా వెంటనే సరిచేసుకోవాలి. అలా సరి చేసుకోకపోతే ఎంత గొప్ప వారినైనా ఈ వాస్తు దోషం సర్వనాశనం చేస్తుంది భవిష్యత్తులో ఎందుకు పనికిరాకుండా చేస్తుంది.
ఆగ్నేయ వాస్తుదోషంతో పిల్లల జీవితం సర్వ నాశనం
ముఖ్యంగా ఈ వాస్తు దోషం పిల్లలపైన ప్రభావాన్ని చూపిస్తుంది. పిల్లల పైన కలిగే దుష్ప్రభావాలు ఆగ్నేయ వాస్తు దోష ప్రభావమే. ఆగ్నేయ వాస్తు దోషం ఉంటే ఆ ఇంట్లో పిల్లలు తల్లిదండ్రులపైనే తిరగబడడం, దాడి చేయడం, రక్తపాతాన్ని సృష్టించడం, దొంగతనాలు చేయడం, ఘర్షణలతో జైలుకు వెళ్లడం వంటి వాటికి కూడా పిల్లలు వెనకాడరు. కాబట్టి ఖచ్చితంగా ఆగ్నేయ వాస్తు దోషాన్ని సరిచేసుకోవాలి.












Click it and Unblock the Notifications