vastu tips: పడమర దిక్కు వాస్తు దోషాలా? శనికి ఆగ్రహం; అనుగ్రహం కోసం చెయ్యండిలా!!
వాస్తుశాస్త్రంలో దిశలకు ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి దిశలోనూ ఒక దేవత నివసిస్తుందని, ప్రతి దిశను ఒక దిక్పాలకుడు పాలిస్తాడని చెబుతారు. వాస్తు శాస్త్రంలో ప్రధాన దిశలు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం దిశలు. అంతేకాదు ఈశాన్య, ఆగ్నేయ, వాయువ్య, నైరుతి లను కూడా కలుపుకుని మొత్తం వాస్తు ఎనిమిది దిక్కులను సూచిస్తుంది. ప్రతి దిశలోనూ దానిని పాలించే ఒక గ్రహం ఉంటుందని, దానికి ఒక దేవత అధిపతిగా ఉంటుందని చెబుతారు.
వాస్తు ప్రకారం శనికి ఇష్టమైన, శని అధిపతి అయిన దిశ పడమర దిశ. మొత్తం ఎనిమిది దిక్కులలో అశుభ ఫలితాలను ఇచ్చే దిశగా దక్షిణం తర్వాత పడమర దిశ చెప్పుకోవలసింది. పడమర దిశ లో వాస్తు దోషాలు ఉంటే తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరైనా పడమర ప్రవేశ ద్వారం ఉన్న ఇంటిలో నివసిస్తుంటే వారు తీవ్ర ఇబ్బందులు పడతారు. ఎంత కష్టపడి పనిచేసినా అందుకు తగ్గ ప్రతిఫలం రాదు.

సమాజంలో గుర్తింపు ఉండదు. పడమర దిశలో తలుపు ఉన్న ఇంట్లో నివసించే వ్యక్తులు విజయాన్ని సాధించలేరు. వారికి పురోగతి శూన్యం గా మారుతుంది. ఎప్పుడు నిరాశ నిస్పృహల్లో బతకాల్సి వస్తుంది. పుట్టెడు అప్పుల్లో మునిగి పోతారు. ఇక పడమరవైపు వాస్తు దోషాలు ఉంటే శని తీవ్ర దుష్ప్రభావాలను మనపై చూపిస్తాడు. కాబట్టి పడమర దిశలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే శనిదేవుని అనుగ్రహం లభిస్తుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
పొరపాటున కూడా పడమర దిశ తూర్పు దిశ కంటే తక్కువ ఎత్తులో ఉండకూడదు. అలా ఉంటే ఆ కుటుంబం ఎప్పటికీ బాగుపడదు. కాబట్టి తూర్పు కంటే పడమర ఎత్తుగా ఉండే లాగా చూసుకోవాలి. అంతేకాదు ఇంటికి పడమర వైపున చిల్డ్రన్స్ రూమ్ కానీ గెస్ట్ రూమ్ కానీ ఉండవచ్చు. అంతేకాదు వాస్తు ప్రకారం ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా ఈ దిశలో ఉంచుకోవచ్చు.
వాస్తు ప్రకారం పశ్చిమ దిశలో గోడలపైన వైలెట్ కలర్, బూడిదరంగు వంటి డార్క్ కలర్స్ ను వేసుకోవాలి. అప్పుడు శని సంతోషిస్తాడు. పడమర గోడలకు ముదురు రంగులు వేయడం వల్ల శని దృష్టి ఆ ఇంట్లోని వారిపై కాస్త మృదువుగా మారుతుంది.ఇక పడమర దిక్కున దోషాలు తొలగిపోవాలంటే ఇంట్లో శని యంత్రాన్ని పెట్టుకోవడం కూడా మంచిదని, శనిదేవుని పూజించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications