Vastu tips: ప్రశాంత జీవనం సాగాలంటే ఇంటికి ఏ దిశలో ఏం ఉండాలి? తెలుసుకోండి!!
ఇంటి నిర్మాణం వాస్తు శాస్త్రం ప్రకారం జరుపుకోవాలి. ఇంటి నిర్మాణం చేసేటప్పుడు కచ్చితంగా వాస్తు ను పాటించాలి. అసలు ఏ దిశలో ఏ గది నిర్మాణం చేయాలి? ఏ వస్తువులు ఎక్కడ పెట్టుకోవాలి? వంటి విషయాలను తప్పక తెలుసుకుని తదనుగుణంగా ఇంటిని నిర్మించుకోవాలి. సరైన దిశలో సరైన నిర్మాణాలు చేయకపోతే, వస్తువులను సరిగ్గా పెట్టుకోకపోతే ఖచ్చితంగా ప్రతికూల ఫలితాలు వస్తాయి.
ఇంట్లో సమస్యలు రాకుండా సానుకూల ఫలితాల కోసం ఏ వస్తువులను ఏ దిశలో ఉంచాలి? ఈ గదులు ఎక్కడ ఉండాలి ? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. ప్రతి ఇంటికి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం మొత్తం ఎనిమిది దిక్కులు ఉంటాయి. ఈ ఎనిమిది దిక్కుల విషయంలో వాస్తు కచ్చితంగా పాటించాలి.

తూర్పు దిశలో సూర్యుడు మరియు ఇంద్రుడు స్థానం ఉంటుంది కాబట్టి ఇంటి తూర్పుదిక్కు ఎప్పుడూ మూసి వేయకూడదు. ఇంటి తూర్పు దిక్కును ఎల్లప్పుడూ ఖాళీగా ఉంచుకోవాలి. ఇంటికి దక్షిణ దిశలో ఎప్పుడూ బరువు ఉంచాలి. ఎందుకంటే ఈ దిశ అంగారక గ్రహానికి సంబంధించినది.
ఇంటికి ఉత్తరదిశకు కుబేరుడు అధిపతి కాబట్టి ఇంటికి ఉత్తర దిశను శుభ్రంగా ఉంచుకుంటే, ఉత్తరం వైపున ఖజానాను ఏర్పాటు చేసుకుంటే ఇంటి ఆర్థిక పరిస్థితి బాగా ఉంటుంది. డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. ఇంటి పశ్చిమదిశ శని దేవుడికి సంబంధించింది. అందుకే ఈ దిశలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఉద్యోగం చేసేవారు కార్యాలయాలకు క్యాబిన్ లను చేసుకోవచ్చు. భోజన స్థలంగా ఉపయోగించుకోవచ్చు.
ఇంటికి ఈశాన్య దిక్కు శివుడికి సంబంధించింది. కాబట్టి ఈ దిశలో పూజ గదిని నిర్మించడం చాలా శుభప్రదంగా చెబుతారు. ఇంటికి ఆగ్నేయ దిశ అగ్ని దేవుడికి సంబంధించింది కాబట్టి ఈ దిశలోనే వంటగది ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఈ దిశలో ఎలక్ట్రానిక్ వస్తువులను కలిగిఉండటం శుభప్రదంగా పరిగణించబడుతుంది.
ఇంటికి నైరుతి దిశ రాహు,కేతువుల కి సంబంధించింది కాబట్టి ఇంటి పెద్దల గదిని, లేదా మాస్టర్ బెడ్ రూమ్ లో ఈ దిశలో చేసుకోవడం మంచిది. ఇంటి వాయువ్య దిశ చంద్రునికి సంబంధించింది కాబట్టి ఈ దిశలో పడకగది గ్యారేజీ లేదా గోశాలను ఏర్పాటు చేసుకోవడం శ్రేయస్కరం.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications