వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Vastu tips: స్త్రీలు మంగళసూత్రం విషయంలో ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు; భర్తకు ఆయుక్షీణం!!

స్త్రీలు మంగళసూత్రం విషయంలో తెలిసీ తెలియక కొన్ని తప్పులు చేస్తారు. అలా తప్పులు చేస్తే భర్తకు ఆయుక్షీణం అంటున్నారు వాస్తు నిపుణులు.

|
Google Oneindia TeluguNews

హిందూ సంస్కృతి, సాంప్రదాయాల ప్రకారం వివాహానంతరం మహిళలు మంగళసూత్రాన్ని ధరించడం వారి వైవాహిక స్థితిని ప్రపంచానికి తెలియజేస్తుంది. సమాజంలో గౌరవానికి కారణమవుతుంది. వివాహం అయిన తర్వాత స్త్రీలు కళ్యాణపు ఉంగరాన్ని, కాలిమెట్టలను, మంగళ సూత్రాన్ని ధరించడం, నుదుటిపై కుంకుమ పెట్టుకోవడం కుటుంబాన్ని నిర్వహించగలిగిన సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. సమాజంలో గౌరవప్రదమైన బాధ్యతను స్వీకరించిన వ్యక్తిగా ఆమెకు సముచితమైన స్థానాన్ని ఇస్తుంది. అందుకే వివాహిత స్త్రీ కచ్చితంగా వీటిని ధరించాలని చెబుతారు.

vastu tips: హోలీ ఆడుతున్నారా? హోలీనాడు ఈ వస్తువులు అస్సలు దానం చెయ్యొద్దు; దురదృష్టం!!vastu tips: హోలీ ఆడుతున్నారా? హోలీనాడు ఈ వస్తువులు అస్సలు దానం చెయ్యొద్దు; దురదృష్టం!!

మంగళసూత్రం పవిత్రం...భార్య నిబద్ధతకు చిహ్నం

మంగళసూత్రం పవిత్రం...భార్య నిబద్ధతకు చిహ్నం


మంగళ సూత్రం అంటే మంగళకరమైన బంధం. పెళ్లి రోజున వరుడు వధువు మెడలో కట్టే ఒక ప్రత్యేకమైన, ఎన్నటికీ విడదీయలేని పవిత్రమైన అనుబంధమే మంగళసూత్రం. నిబద్ధతకు, ప్రేమకు, నమ్మకానికి చిహ్నంగా భర్త బ్రతికున్నంత కాలం భార్య మంగళ సూత్రాన్ని ధరించాలని చెబుతారు. వేదమంత్రోచ్ఛారణలతో, బంధుమిత్రుల, సకుటుంబ సపరివార సమేతంగా ప్రతి ఒక్కరి ఆశీర్వాదాలతో ఎంతో పవిత్రంగా కట్టే మంగళసూత్రం విషయంలో మహిళలు కొన్ని జాగ్రత్తలను పాటించాలి.

నరదృష్టి నుండి భర్తను కాపాడేది ఇదే

నరదృష్టి నుండి భర్తను కాపాడేది ఇదే


మంగళ సూత్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు మెడలో నుంచి తీయకూడదు. అసలు మంగళ సూత్రాన్ని మెడ నుండి తియ్యకుండా ఉండడమే మంచిదని చెప్తున్నారు. మంగళ సూత్రంలో గుచ్చే నల్లపూసలలో దైవ శక్తి ఉంటుంది. అది ఆ జంటను నరదృష్టి నుండి కాపాడుతుంది. భర్తకు పరిపూర్ణమైన ఆయుష్షును ఇస్తుంది. కనుక భర్త ఆయుష్షు కోసం మంగళసూత్రాన్ని ఎప్పటికీ మెడలో ఉంచుకోవాలి. మంగళసూత్రం పోయిన, విరిగిపోయిన అరిష్టంగా చెబుతారు.

మంగళసూత్రానికి హెయిర్ పిన్నులు, పిన్నీసులు .. భర్త ఆయుక్షీణం

మంగళసూత్రానికి హెయిర్ పిన్నులు, పిన్నీసులు .. భర్త ఆయుక్షీణం


మంగళసూత్రం విషయంలో మహిళలు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. కొంతమంది మహిళలు మంగళ సూత్రానికి హెయిర్ పిన్నులు, పిన్నిసులు పెడుతూ ఉంటారు. అయితే వేదమంత్రాలతో పవిత్రంగా మెడలో కట్టిన మంగళసూత్రానికి ఈ విధంగా పిన్నిసులు పెట్టడం మంచిది కాదని, అలా పెడితే భర్త ఆయుష్షు మీద ప్రభావం పడుతుందని చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా తెలిసీ తెలియక అలా చేస్తే తప్పక తప్పు అని చెప్పి వాటిని మంగళసూత్రం నుండి వేరు చెయ్యాలని చెప్తున్నారు.

మంగళసూత్రం అలా ఉంటే భర్తకు అనారోగ్యం

మంగళసూత్రం అలా ఉంటే భర్తకు అనారోగ్యం


అంతేకాదు మంగళసూత్రం స్త్రీల హృదయం వద్ద ఉంటుంది. కాబట్టి హెయిర్ పిన్నులు, పిన్నిసులు మంగళ సూత్రంలో ఉన్న దివ్యమైన శక్తిని ఆకర్షించి భర్తను శక్తిహీనుడుగా చేస్తాయని, దీంతో భర్తకు అనారోగ్యం కలుగుతుందని చెబుతారు. అంతేకాదు భార్యాభర్తల పట్ల ఒకరికి ఒకరిపై ఒకరికి అనురాగం తగ్గుతుందని చెబుతారు. కనుక పొరపాటున కూడా మంగళసూత్రానికి హెయిర్ పిన్నులు, పిన్నిసులు పెట్టకూడదని సూచిస్తున్నారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Women knowingly and unknowingly make some mistakes in Mangalsutra.Vastu experts say that if you do such mistakes, the life of the husband will be shortened.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X