సెప్టెంబర్ లో వీరికి భారీ సిరిసంపదల ఖజానాను మోసుకొస్తున్న బుధ శుక్రులు!
సెప్టెంబర్ మాసంలో ముఖ్య గ్రహాల కలయిక కారణంగా అనేక రాజయోగాలు ఏర్పడుతున్నాయి. సాధారణంగా గ్రహాల సంచారం,గ్రహాల సంయోగంతోను ఏర్పడే కొన్ని యోగాలు శుభయోగాలు కాగా మరికొన్ని యోగాలు అశుభయోగాలు. వేద జ్యోతిష్యశాస్త్రంలో పంచ మహాపురుష రాజయోగాలలో ఒకటిగా మాలవ్య రాజయోగం చెప్పబడింది. సెప్టెంబర్ మాసంలోనే భద్రరాజయోగం కూడా ఏర్పడుతుంది ఈ రెండు రాజయోగాల కారణంగా సెప్టెంబర్ మాసంలో కొన్ని రాశులవారు ధనవంతులు కాబోతున్నారు. మరి ఆ అదృష్టరాశులు ఎవరో తెలుసుకుందాం.
మకర రాశి
భద్ర, మాలవ్య రాజయోగాలు ఏర్పడడం కారణంగా మకర రాశి జాతకులకు కలిసొస్తుంది. మకర రాశి జాతకులకు బుధ గ్రహ సంచారంతోనూ, శుక్ర గ్రహ అనుగ్రహంతోనూ ఉద్యోగ వ్యాపారాలలో అదృష్టం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం చేసే వారికి కార్యాలయంలో కొత్త బాధ్యతలు వస్తాయి. మంచి ఉద్యోగ ఆఫర్లను కూడా పొందుతారు .పెండింగ్ పనులు పూర్తవుతాయి. వర్తక వ్యాపారాలు చేసేవారు లాభాలను పొందుతారు. ఈ సమయంలో సంపదల వర్షం కురుస్తుంది.

కర్కాటక రాశి
భద్ర, మాలవ్య రాజయోగాల కారణంగా కర్కాటక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఇక సెప్టెంబర్ మాసంలో వీరికి మంచి రోజులు మొదలవుతాయి. బుధుడు, శుక్రుడు కర్కాటక రాశికి భౌతిక ఆనందాలను కలిగిస్తారు. ఈ సమయంలో వీరు లగ్జరీగా బతుకుతారు. ఆస్తి లేదా వాహన యోగం ఉంటుంది. తల్లితో సంబంధం మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. కుటుంబం మీకు అడుగడుగునా మద్దతుగా ఉంటుంది. ఈ రాశి వారికి బాగా కలిసొస్తుంది.
మిధున రాశి
భద్ర, మాలవ్య రాజయోగాల కారణంగా మిధున రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. సెప్టెంబర్ మాసంలో మిధున రాశి వారు మంచి ఫలితాలను పొందుతారు. లగ్జరీ లైఫ్ లో గడుపుతారు. వాహనాలు ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. డబ్బు సంపాదించేందుకు నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వ్యాపారంలో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో సంబంధం బాగుంటుంది. భూమిని లేదా ఆస్తిని కొనుగోలు చేయవచ్చు .ఈ సమయంలో కొన్ని శుభవార్తలను వింటారు. అన్ని విధాలా వీరికి కలిసొస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications