త్వరలో వీరికి మహా పురుష రాజయోగం అనుగ్రహించిన శుక్రుడు!
శుక్రుడికి జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. శుక్రుడిని విలాసాలకు అధిపతిగా చెబుతారు. లగ్జరీలకు కారకుడైన శుక్రుడు జూన్ 29వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు వృషభ రాశిలో సంచారం చేస్తాడు. వృషభ రాశిలో సంచారం చేసే శుక్రుడు మాలవ్య మహా పురుష రాజయోగాన్ని ఏర్పరుస్తారు.
మాలవ్య మహాపురుష రాజయోగం
మానవ జీవితంలో సుఖసంతోషాలకు, సిరిసంపదలకు, ప్రేమలకు, పెళ్లిళ్లకు కారకుడైన శుక్రుడు నెలరోజుల పాటు తన స్వక్షేత్ర మైన వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల మాలవ్య మహాపురుష రాజయోగాన్ని ఏర్పరిచి కొన్ని రాశుల వారికి ప్రయోజనాలను చేకూరుస్తున్నాడు. మరి శుక్రుడి కారణంగా శుభ ఫలితాలను పొందుతున్న ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మిధున రాశి
వృషభ రాశిలో శుక్ర సంచారం కారణంగా మిధున రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. మిధున రాశి వారికి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఈ సమయంలో ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మిధున రాశి వారి వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో పురోగతి ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి మిధున రాశి వారికి పూర్తి మద్దతు లభిస్తుంది.
సింహరాశి
వృషభరాశిలో శుక్ర సంచారం సింహరాశి జాతకులకు అన్ని విధాల శుభ ఫలితాలను ఇస్తుంది. సింహరాశి వారికి ఈ సమయంలో ఏ పని చేసిన కలిసి వస్తుంది. సింహరాశి వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. వ్యాపారాలు చేసే సింహరాశి వారు పురోగతి సాధించే అవకాశం ఉంది. జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. విద్యార్థులు పరీక్షలలో విజయాలను సాధిస్తారు. సింహరాశి వారు ధార్మికంగా ముందు వరుసలో ఉంటారు. వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
ధనుస్సు రాశి
వృషభ రాశిలో శుక్ర సంచారం ధనుస్సు రాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. ధనుస్సు రాశి జాతకులు ఈ సమయంలో లాభాలను పొందుతారు. ఈ రాశి వారు అన్ని పనులలో విజయాలను సాధిస్తారు. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వీరికి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వీరి వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ప్రతి పనిలోనూ ధనుస్సు రాశి వారు విజయాలను సాధిస్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications