డిసెంబర్లో ఈ రాశులవారికి ధన సంక్షోభాన్ని, దరిద్రాన్ని దానమిచ్చిన శుక్రుడు!

డిసెంబర్ రెండవ తేదీన శని రాశి అయిన మకర రాశిలోకి శుక్ర సంచారం జరుగుతుంది. డిసెంబర్ 28వ తేదీ వరకు మకర రాశిలో శుక్రుడు సంచరిస్తాడు. అయితే ఈ సమయం శుక్ర సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని మరికొన్ని రాశుల వారికి దురదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. మకర రాశిలో శుక్ర సంచారం కారణంగా దరిద్రాన్ని కొనితెచ్చుకుంటున్న ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మిధున రాశి
మిధున రాశి జాతకులకు శుక్ర సంచారం కారణంగా ఆదాయం తగ్గుతుంది. ఖర్చులు పెరగడం వల్ల ఇబ్బందులు అనుభవిస్తారు. పనిచేసే చోట ఒత్తిడి పెరుగుతుంది. పని భారం ఆరోగ్యం పైన ప్రతికూలమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఒత్తిడి కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. మానసిక ప్రశాంతత లోపిస్తుంది . వ్యాపారస్తులకు బిజినెస్ బాగా తగ్గుతుంది.

Venus brings financial crisis and poverty to these zodiac signs in December

కర్కాటక రాశి
శుక్ర సంచారం కర్కాటక రాశి వారి ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎముకలకు సంబంధించిన ఇబ్బందులు, నొప్పులు బాధిస్తాయి. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. దీని కారణంగా పని దెబ్బతింటుంది. ఆదాయం తగ్గుతుంది. ఈ సమయం కర్కాటక రాశి వారికి కష్టంగా ఉంటుంది.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారి కి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ఖర్చులు పెరుగుతాయి. చేతిలో డబ్బు నిలవదు. ఉద్యోగం చేసేవారు చిరాకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపారాలలో లాభాలు తగ్గుతాయి. ఆరోగ్యం విషయంలో ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎంత పొదుపు చేద్దామన్న అనవసరపు ఖర్చులు మీద పడతాయి.

ధనుస్సు రాశి
శుక్ర సంచారం కారణంగా ధనుస్సు రాశి వారికి మనశ్శాంతి ఉండదు. కుటుంబ జీవితం గందరగోళంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో వివాదాలు చోటుచేసుకుని ఇద్దరి మధ్య ఎడబాటు కలిగే అవకాశం ఉంటుంది. అత్యంత బాధాకరంగా ఈ సమయం ధనస్సు రాశి వారికి గోచరిస్తుంది. ఆఫీసులో పని ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఆరోగ్యం క్షీణిస్తుంది. మానసికంగా ఏమాత్రం ప్రశాంతతతో ఉండరు.

కుంభరాశి
శుక్ర సంచారం కారణంగా కుంభరాశి జాతకులకు వృత్తిపరమైన ఇబ్బందులు వస్తాయి. ఈ సమయంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. వ్యాపారంలో మంచి ఆదాయాలు లేక ఇబ్బందులు పడతారు. ఉద్యోగంలో చిరాకులు చోటు చేసుకుంటాయి. వృధా ఖర్చుల కారణంగా ధన సంక్షోభం చోటు చేసుకుంటుంది. కుంభ రాశి వారికి ఇది కష్టకాలం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+