సెప్టెంబర్ లో వీరికి రాజభోగాలను సిద్ధం చేస్తున్న శుక్రుడు!

వేద జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. శుక్రుడు విలాసాలకు అధిపతి. శుక్రుడు జాతకంలో మంచి స్థానంలో ఉంటే ఆ జాతకులకు విలాసాలకు, సుఖసంతోషాలకు కొదవ ఉండదు. అదే శుక్రుడు అశుభ స్థానంలో ఉంటే కొన్ని ఇబ్బందులు కూడా కలగవచ్చు. అయితే సెప్టెంబర్ మాసంలో శుక్రుడు తన సొంత రాశి అయిన తులా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు .

సెప్టెంబర్ లో శుక్ర సంచారం
సెప్టెంబర్ 18వ తేదీన మధ్యాహ్నం రెండు గంటల నాలుగు నిమిషాలకు శుక్రుడు తులా రాశిలో సంచరిస్తాడు. తులారాశిలో శుక్ర సంచారంతో మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. శుక్రుడు అక్టోబర్ 12వ తేదీ వరకు తులారాశి లోనే ఉండి ఆపై వృశ్చిక రాశిలోకి వెళతాడు. సొంత రాశిలో శుక్ర సంచారం కారణంగా శుక్రుని అనుగ్రహం వల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతున్నాయి. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

Venus brings royal life and wealth in September to these zodiac signs

మేషరాశి
సెప్టెంబర్ మాసంలో శుక్ర గోచారం కారణంగా మేష రాశి జాతకులకు శుభ ఫలితాలు వస్తాయి. మేష రాశి వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ సమయంలో మేష రాశి వారు ఆర్థికంగా లాభాలను పొందుతారు. విలాసాలను అనుభవిస్తారు. జీవిత భాగస్వామి నుండి మద్దతు పొందుతారు. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి.

తులారాశి
సెప్టెంబర్ మాసంలో శుక్ర సంచారం కారణంగా తులా రాశి జాతకులకు శుభ ఫలితాలు వస్తాయి. తులారాశిలోనే శుక్రుడు సంచరించనున్న నేపథ్యంలో ఈ రాశివారికి ఇది అదృష్ట సమయంగా చెప్పవచ్చు. శుక్ర సంచారం కారణంగా తులారాశి వారికి నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఆర్థికప్రయోజనాలు కలుగుతాయి. కెరీర్ పరంగాను లబ్ధి చేకూరుతుంది. పెళ్లికాని వారికి పెళ్లిళ్లు సెటిల్ అవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు దొరుకుతుంది. వ్యాపారస్తులకు లాభాలను చేకూర్చే సమయం.

మకర రాశి
సెప్టెంబర్ మాసంలో శుక్ర సంచారం కారణంగా మకర రాశి వారికి లబ్ధి చేకూరుతుంది. ఈ సమయంలో మకర రాశి వారు ఆర్థికంగా బలంగా ఉంటారు. తండ్రి సహకారంతో ధన లాభాన్ని పొందుతారు. ఉద్యోగాలు చేసేవారు పురోగతిని సాధిస్తారు. కొత్త బాధ్యతలను స్వీకరించడం ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు సంతోషాన్ని కలిగిస్తాయి. ఈ సమయం మకర రాశి వారికి కూడా అదృష్ట సమయంగా చెప్పవచ్చు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+