డిసెంబర్ లో వీరికి రెట్టింపు సంపదలనిస్తానని డబుల్ సంచారం చేయనున్న శుక్రుడు!
వేద జ్యోతిష శాస్త్రంలో కొన్ని కొన్ని సార్లు గ్రహాలు ఒకే నెలలో రెండు సార్లు సంచారాన్ని సాగిస్తాయి. గ్రహాల డబుల్ సంచారం ప్రభావం ద్వాదశ రాశుల వారి పైన ఉంటుంది. డిసెంబర్ నెలలో విలాసాలకు సంపదలకు అధిపతి అయిన శుక్రుడు రెండుసార్లు సంచారం చేస్తున్నాడు.
శుక్రుడి డబుల్ సంచారం
డిసెంబర్ రెండవ తేదీన మకర రాశిలోకి, డిసెంబర్ 28వ తేదీన కుంభ రాశిలోకి శుక్రుడు ప్రవేశిస్తున్నాడు. ఇక డిసెంబర్ నెలలో శుక్రుడి డబుల్ సంచారం కారణంగా ముఖ్యంగా మూడు రాశుల వారికి కలిసి వస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

వృషభ రాశి
వృషభ రాశి జాతకులకు శుక్రుడి డబుల్ సంచారం మంచి ఫలితాలను ఇస్తుంది. వృషభ రాశిలో శుక్రుడు దశమ స్థానంలో సంచరించడం వల్ల ఈ సమయంలో వృషభ రాశి వారు అదృష్టవంతులుగా మారుతున్నారు. వృషభ రాశిలోని నిరుద్యోగులకు ఈ నెలలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త వ్యాపార ఒప్పందాలు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇది సరైన సమయం.
మకర రాశి
మకర రాశి జాతకులకు శుక్రుడి డబుల్ సంచారం శుభాలను కలిగిస్తుంది. శుక్రుడు మకరరాశిలో ఒకసారి మకర లగ్నంలో రెండవసారి ధనస్థానంలో సంచరించడం వల్ల మకర రాశి వారికి గొప్ప ప్రయోజనాలు చేకూరుతున్నాయి. వీరి ఆర్థిక పరిస్థితులు ఈ సమయంలో మెరుగుపడతాయి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. వ్యాపారంలో ఊహించని విధంగా లాభాలను పొందుతారు. మకరరాశి వారి వైవాహిక జీవితం బాగుంటుంది.
కుంభరాశి
డిసెంబర్ నెలలో రెండు సార్లు శుక్రుడు సంచారం చేయడం వల్ల కుంభరాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో కుంభరాశి జాతకులు ఆర్థిక పురోగతిని పొందుతారు. శుక్రుడు రెండుసార్లు కుంభరాశిలో ధనస్థానంలోనూ, లాభ స్థానంలో సంచరించడం వల్ల ఈ సమయంలో వీరు చేపట్టిన అన్ని పనులు పూర్తవుతాయి. ఎంతో కాలంగా వసూలు కాని మొండి బాకీలు వసూలవుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. దీంతో కుంభరాశి వారికి అంతా శుభమే జరుగుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications