రేపటి నుండి వీరికి అఖండ ధనయోగం.. నామాటే శాసనమన్న శుక్రుడు!
రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు నవగ్రహాలలో ప్రత్యేకమైన గ్రహంగా చెప్పబడుతున్నాడు. అటువంటి శుక్రుడు తన రాశి మరియు నక్షత్ర సంచారంతో అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తున్నాడు. సంపదలను, శ్రేయస్సును మరియు లగ్జరీలను ఇచ్చే శుక్రుడు జనవరి 17వ తేదీన ఉదయం ఏడు గంటల 51 నిమిషాలకు పూర్వభాద్ర నక్షత్రం లోకి ప్రవేశిస్తున్నాడు.
బృహస్పతి నక్షత్రంలోకి శుక్రుడు
బృహస్పతి నక్షత్రం అయిన పూర్వాభాద్ర నక్షత్రం లోకి శుక్ర సంచారం శుభ ఫలితాలకు హేతువు. పూర్వభాద్ర నక్షత్రం లోకి శుక్ర సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలు, సంపదలు కలుగుతున్నాయి. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

శుక్రుడు పూర్వాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల కుంభరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. కుంభరాశిలో లగ్న గృహంలో శుక్రుడు సంచరిస్తాడు. కాబట్టి శుక్రుడు ఈ రాశి వారికి మెరుగైన ప్రయోజనాలను కలిగిస్తాడు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి అయ్యేలా చూస్తాడు. కుంభరాశి వారికి ఈ సమయంలో సంపద మరియు శ్రేయస్సు లభిస్తుంది. తల్లిదండ్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. పెళ్ళికాని వారికి పెళ్లి సంబంధాలు కుదురుతాయి.
మేషరాశి
సంపదలకు అధిపతి అయిన శుక్రుడు పూర్వభాద్ర నక్షత్రంలో ప్రవేశించడం వల్ల మేషరాశి జాతకులకు కలిసి వస్తుంది. మేషరాశిలో 11వ ఇంట్లో శుక్ర సంచారం జరుగుతుంది. దీంతో మేషరాశి వారు అన్ని రంగాలలో అపారమైన విజయాలను పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. తల్లితండ్రులు మరియు గురువు నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. భారీ ఆర్థిక లాభాలతో ప్రతి రంగంలోనూ అపారమైన విజయాలను సాధిస్తారు.
మిధున రాశి
శుక్రుడు పూర్వభాద్ర నక్షత్రం లోకి వెళ్లడం వల్ల మిధున రాశి వారికి ప్రయోజనాలు కలుగుతాయి. మిధున రాశిలో తొమ్మిదవ ఇంట్లో శుక్ర సంచారం జరుగుతుంది. ఇది వీరికి పూర్తి అదృష్టాన్ని, మద్దతును ఇస్తుంది. మిధున రాశి వారి జీవితంలో అనుకూలమైన పరిణామాలు ఏర్పడతాయి. శుక్రుని అనుగ్రహంతో దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. సోదర సోదరీమణులతో మంచి సమయాన్ని గడుపుతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications