మే నెలాఖరు నుండి ఈ రాశులవారు అపర కుబేరులు అవుతారన్న శుక్రుడు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. సూర్య మండలంలోని ఒక గ్రహమైన శుక్రుడు సూర్యునికి దగ్గరగా ఉండే రెండో గ్రహం. నవగ్రహాలలో కెల్లా అత్యంత ప్రకాశవంతమైన గ్రహం కూడా. శుక్రాచార్యుడు రాక్షసుల గురువు. శుక్రుడు విలాసాలకు అధిపతి. శారీరక సుఖానికి, సౌందర్యానికి, రాజసానికి, వినోదానికి, ఐశ్వర్యానికి, కళలకు శుక్రుడిని అధిపతిగా చెబుతారు.
శుక్ర సంచారం.. అదృష్ట రాశులు
శుక్రుడు లగ్నంలో ఉన్న జాతకుడు ఆరోగ్యవంతుడు గాను, మంచి సుందరమైన శరీరం కలిగినవాడుగాను పుడతాడు. సుఖజీవిగా జీవిస్తాడు. చిరంజీవిగా ఉంటాడు. జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే సకల విలాసాలు కలుగుతాయి. జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి శుక్రుడు మే 31వ తేదీన మీనరాశి నుంచి మేషరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. మేషరాశిలోకి శుక్రసంచారం కొన్ని రాశులవారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. మరి ఆ రాశులేమిటో తెలుసుకుందాం.

మిధున రాశి
శుక్రుడు మేష రాశిలోకి సంచరించే సమయం మిధున రాశి జాతకులకు ప్రయోజనకరంగా ఉంటుంది. మిధున రాశిలో శుక్రుడు 11వ స్థానంలో సంచారం చేయబోతున్నాడు. ఇది వీరికి ప్రతి రంగంలోనూ విజయాలను అందిస్తుంది. పిల్లల నుండి శుభవార్తలు వింటారు. వర్తక వ్యాపారాలు చేసేవారు లాభాలు పొందుతారు. నూతన ఒప్పందాలు చేసుకుంటే మంచిది. మిధున రాశి వారికి ఆర్థికంగా ఈ సమయం కలిసి వస్తుంది. మిధునరాశి వారి ప్రేమజీవితం సంతోషంగా ఉంటుంది.
సింహరాశి
సింహరాశి వారికి శుక్ర సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. శుక్రుడు పదవ స్థానంలో సంచారం చేయడం వల్ల ఉద్యోగాలు చేసే వారికి పురోగతి కనిపిస్తుంది. జీవితంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. వర్తక,వ్యాపారాలు చేసే వారికి అద్భుతమైన లాభాలు వస్తాయి. నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది మంచి సమయం. సింహరాశి వారి ప్రేమ జీవితం బాగుంటుంది. జీవితంలో వచ్చే సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి.
కుంభరాశి
శుక్ర సంచారం కుంభ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. కుంభరాశిలో మూడవ స్థానంలో శుక్ర సంచారం జరగడం కారణంగా కుంభ రాశి వారికి అన్ని రకాలుగా పరిస్థితులు మెరుగుపడతాయి. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. ఉద్యోగాలు చేస్తున్న వారికి ఇది గొప్ప అవకాశాలను ఇస్తుంది. ఇది కుంభ రాశి వారికి కలిసి వచ్చే సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications