డిసెంబర్ 2వరకు ఈ రాశులవారికి కుబేర యోగాన్ని వరమిచ్చిన విలాసాల అధిపతి!

వేద జ్యోతిష్య శాస్త్రంలో నిర్దిష్ట సమయంలో గ్రహాల గమనం కొనసాగుతుంది. ఇక విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు ప్రస్తుతం వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశిలోకి సంచారం చేస్తున్నాడు. ధనస్సు రాశిలోకి శుక్ర సంచారం 3 గంటల 21 నిమిషాలకు జరుగుతుంది. నేడు శుక్రుడు ధనుస్సురాశిలోకి సంచారం చేయడం కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి.

మేషరాశి
మేషరాశిలో శుక్రుడు ఏడవ ఇంటిని, రెండవ ఇంటిని పాలిస్తాడు. ధనుస్సురాశిలో సంచారం చేస్తున్నప్పుడు శుక్రుడు తొమ్మిదవ ఇంట్లో ఉంటాడు. ఇది మేష రాశి జాతకులకు అదృష్టాన్ని కలిగిస్తుంది. వివిధ రంగాల్లో పనిచేసే వారికి శుక్ర సంచారం కారణంగా ప్రయోజనం జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. విదేశాలలో ఉండే వారికి మంచి అవకాశాలు వస్తాయి. మీరు కోరుకునే వ్యక్తిని పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

Venus has blessed these zodiac signs with wealth and luxury till December 2

మిధున రాశి
మిధున రాశిలో శుక్రుడు 5 ఇంటిని 12వ ఇంటిని పాలిస్తాడు. ధనుస్సు రాశిలో శుక్ర సంచారం సమయంలో శుక్రుడు మిధున రాశిలో ఏడవ ఇంట్లో ఉంటాడు. శుక్ర సంచారం మిధున రాశి జాతకులకు లాభాలను ఇస్తుంది. శుక్ర సంచారం కారణంగా మిధున రాశి వారికి అంతర్జాతీయ లావాదేవీలలోను గణనీయమైన లాభాలు వస్తాయి. ఈ సమయంలో వీరు సంపన్నమైన స్థితికి వెళతారు.

సింహరాశి
సింహరాశిలో శుక్రుడు మూడవ ఇంటిని, పదవ ఇంటిని పాలిస్తాడు. అయితే ధనుస్సురాశిలో శుక్ర సంచారం జరిగే సమయంలో శుక్రుడు సింహరాశిలో ఐదవ ఇంట్లో సంచరిస్తాడు. ఈ సంచారం సృజనాత్మక రంగాలలో పనిచేసే వారికి లాభాలను తెచ్చిపెడుతుంది. సింహ రాశి వారికి సహోద్యోగులు సహకారాన్ని అందిస్తారు. ఉన్నత స్థాయిలో పనిచేయడానికి మంచి వాతావరణం ఏర్పడుతుంది. ఎంచుకున్న రంగంలో విజయం సాధించడానికి కావలసిన సామర్థ్యం మీలో పెరుగుతుంది.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలో శుక్రుడు ఏడవ ఇంటిని 12వ ఇంటిని పాలిస్తాడు. ధనుస్సు రాశిలో శుక్ర సంచారం జరిగే సమయంలో శుక్రుడు వృశ్చిక రాశిలో రెండవ ఇంట్లో ఉంటాడు. ఈ శుక్ర సంచారం డబ్బుపరంగా వృశ్చిక రాశి వారికి లాభాలను ఇస్తుంది. వృశ్చిక రాశి వారికి సంబంధించి ఈ సమయంలో సత్ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశి వారు కెరీర్లో శుభవార్తలు వింటారు. సమాజంలో కీర్తి, ప్రతిష్టలు లభిస్తాయి. ఆర్థిక విజయాలు చోటుచేసుకుంటాయి. ఇది వృశ్చిక రాశి వారికి అదృష్ట సమయం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+