ఈ వారమంతా వీరికి డబ్బుల సంచులను పంపిస్తున్న శుక్రుడు!!
వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాలు గమనం కారణంగా చోటుచేసుకునే రాశుల జాతకాల మార్పులు అందరికీ తెలిసిందే. తాజాగా ఆగస్టు 11వ తేదీన శుక్రవారం పూర్వ ఫాల్గుణి పుబ్బ నక్షత్రంలోకి ప్రవేశించాడు. శుక్రుడు పూర్వ ఫాల్గుణి నక్షత్రం లోకి ప్రవేశించటం వల్ల కొన్ని రాశుల వారు అదృష్టవంతులుగా మారారు.
వారం రోజులపాటు వీరికి శుక్రుడి కటాక్షం
పూర్వ ఫాల్గుణి నక్షత్రంలో శుక్రుడు ఆగస్టు 22వ తేదీ వరకు ఉంటాడు. ఇక దీనివలన కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు వస్తాయి సంపద శ్రేయస్సు కలుగుతాయి. శుక్రుడు తన సొంత నక్షత్రమైన పుబ్బ నక్షత్రం లో ఉన్న శుభ ప్రభావం కారణంగా మరో వారం రోజులు పాటు లబ్ధి పొందే ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మిధునరాశి
పుబ్బ నక్షత్రంలో శుక్ర సంచారం కారణంగా మిధునరాశి వారికి గణనీయమైన లాభాలు వస్తాయి. ఈ సమయంలో మిధునరాశి వారికి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. పనిచేసే చోట గుర్తింపును పొందుతారు. డబ్బు ఆదా అవుతుంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మిధునరాశి రాశి వారి ఆదాయం మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా జీవిస్తారు.
కుంభరాశి
పుబ్బ నక్షత్రంలో శుక్ర సంచారం కుంభరాశి జాతకులకు అదృష్టాన్ని తెస్తుంది. ఈ సమయంలో కుంభరాశి వారిపై శుక్రుడు దయ పుష్కలంగా ఉంటుంది. ఈ సమయంలో పెద్ద వ్యాపార ఒప్పందాన్ని చేసుకుంటారు. వర్తక వ్యాపారాలు లాభిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.
కర్కాటకరాశి
పుబ్బ నక్షత్రంలో శుక్ర సంచారం కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. కర్కాటక రాశి వారు ఇప్పుడు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. నూతన ఉద్యోగ అవకాశాలను పొందే ఛాన్స్ ఉంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి గణనీయమైన ప్రయోజనాలు వస్తాయి. ఏ పని చేసినా విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోయి తిరిగి సంతోషంగా కుటుంబంతో గడుపుతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications